ఎమ్మెల్యే ధూళిపాళ్ల నాపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటా
పెదకాకాని మేజర్ న్యూస్: పెదకాకాని మండలంలో మేజర్ పంచాయతీ అయినా పెద్దకాకాని గ్రామాన్ని అమరావతి తరహాలో అభివృద్ధి చేయాలని లక్ష్యంతో ముందుకు వెళుతున్నామని, పెదకాకాని గ్రామ కూటమి సర్పంచ్ అభ్యర్థి షేక్ షహిర్ భాష తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొన్నూరు శాసనసభ్యులు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ తనపై, తన కుటుంబం పై, గ్రామ పెద్దల మాటపై నమ్మకంతో తనను పెదకాకాని గ్రామ కూటమి సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించడం సంతోషకరమని అన్నారు. పెదకాకాని మూడు పవిత్ర పుణ్యక్షేత్రాలకు నిలయమని, పెదకాకాని గ్రామ చరిత్ర రాష్ట్రవ్యాప్తంగా వ్యాపించి ఉందని అలాంటి పెదకాకాని గ్రామాన్ని అభివృద్ధి చేసే అవకాశం, అభివృద్ధిలో పాలుపంచుకునే సదవకాశాన్ని స్థానిక శాసనసభ్యుల వారు తనకు ఇవ్వటం తన పూర్వజన్మ సుకృతం అని ఆయన పేర్కొన్నారు. అమరావతి రాజధాని కి గుంటూరు, కృష్ణ మహానగరాల మధ్యలో 16వ నెంబర్ జాతీయ రహదారి పక్కన ఉన్న పెదకాకాని గ్రామం మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. పొన్నూరు శాసనసభ్యులు ధూళిపాల నరేంద్ర కుమార్ రాజకీయాలకతీతంగా గ్రామాల అభివృద్ధికి చేస్తున్న కృషికి ఆకర్షితునై రాజకీయాల్లోకి రావడం జరిగిందని, పదవిని అధికారం గా కాకుండా బాధ్యతగా నిర్వర్తిస్తానని, పెదకాకాని గ్రామ ప్రజలకు జవాబుదారీగా ఉంటానని, పెదకాకాని గ్రామ ప్రజల అవసరాలను తీర్చడమే లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు. ప్రభుత్వ అండదండలతో స్థానిక శాసనసభ్యుల వారి సహకారంతో పెదకాకాని గ్రామంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు ప్రజలకు అందే విధంగా కృషి చేస్తానని తెలిపారు పెదకాకాని గ్రామంలో ప్రధాన సమస్య అయిన డ్రైనేజ్ వ్యవస్థను సమూలంగా సంపూర్ణంగా మార్పు చేసి, పక్కా ప్రణాళికతో మురుగునీరు గ్రామం వెలుతులకి వెళ్లే విధంగా చర్యలు తీసుకుంటానని తెలిపారు. గ్రామ పరిధిలోని చెరువులను అభివృద్ధి చేసి వాకింగ్ ట్రాక్లను మరింత సౌకర్యవంతంగా తయారు చేయడానికి కృషి చేస్తానని అన్నారు. పెద్దకాకాని గ్రామ పరిధిలోని ఆరోగ్య కేంద్రాన్ని అభివృద్ధి చేసి మౌలిక వసతులు కల్పనకు కృషి చేస్తానన్నారు. పెదకాకాని గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడంతోపాటు అధర్భగదుల నిర్మాణానికి విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా వసతులు కల్పించడానికి కృషి చేస్తానన్నారు. పెదకాకాని గ్రామంలోని మహిళల ఆర్థిక స్వాలంబనకు కృషి చేస్తానన్నారు. యువతకు ప్రభుత్వ సహకారంతో నైపుణ్య కేంద్రాలు ఏర్పాటు చేసి వారికి శిక్షణ ఇప్పించి వారి ఉపాధికి బాటలు వేస్తానని అన్నారు. పొన్నూరు శాసనసభ్యులు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ సహకారంతో పెదకాకాని మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వలివేటి మురళీకృష్ణ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని పెదకాకాని గ్రామానికి మరింత చేరువ చేస్తానన్నారు. పెదకాకాని గ్రామంలోని రైతులకు వారు పండించిన పంటలు తరలించడానికి గ్రామంలో పొలాలకు వెళ్లే దొంగలు గ్రావెల్ రోడ్లు ఏర్పాటు కృషి చేస్తానన్నారు
ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ రాజకీయ సిద్ధాంతమే నా సిద్ధాంతం కూడా అధికారంలో ఉన్నప్పుడు రాజకీయాలకు అతీతంగా అన్ని గ్రామాల గ్రామాల్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నారు అని విషయాన్ని పట్టించుకోకుండా గ్రామాల అభివృద్ధికి సహకరించే ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ మార్గాన్ని నేను అనుసరిస్తాను కూటమి ఆశయాలు నరేంద్ర కుమార్ ఆశయాలు నా ఆశయం ఒక్కటే పెదకాకాని గ్రామ అభివృద్ధి ప్రధాన లక్ష్యం.
తొలుత గ్రామస్థాయిలో గ్రామ పెద్దలతో పార్టీ నాయకులతో కార్యకర్తలతో ఆయా గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి గ్రామస్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలు గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తాను గ్రామంలో మౌలిక వసతులైన తాగునీరు రోడ్లు డ్రైనేజ్ వంటి కనీస మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికి కృషి చేస్తాను అన్నారు.
గ్రామీణ ప్రాంత ప్రజలకు అత్యంత అవసరమైన విద్యా వైద్యం ఉపాధి అవసరాలు మౌలిక వసతులు కల్పించడానికి వాటిని మెరుగుపరచడానికి జిల్లా పరిషత్ నుండి నిధులు సమీకరించి విద్యా వైద్యం ఉపాధి రంగాల్లో పెదకాకాని మండల ప్రజలకు కొరత లేకుండా కృషి చేస్తాను అన్నారు. ఆధారిత ప్రాంతం రైతులకు అత్యంత అవసరమైన సాగునీరు, విత్తనాలు, గిట్టుబాటు ధర పరిష్కరించడానికి జిల్లా పరిషత్ సమావేశాల్లో చర్చించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను. ప్రభుత్వ సంక్షేమ పథకాలు (ఫించన్లు, రేషన్, ఇళ్లు) అర్హులైన ప్రతి ఒక్కరికీ రాజకీయ పక్షపాతం లేకుండా అందేలా చూస్తాను. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పొన్నూరు శాసనసభ్యులు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ సహకారంతో పెదకాకాని అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని గ్రామంలో
ఉన్న సమస్యలపై చర్చించి అభివృద్ధి పనులకు నిధులు కేటాయించే విధంగా కృషి చేస్తాను అని షహీర్ భాష అన్నారు.
సీనియర్ రిపోర్టర్ అహ్మద్ పెదకాకాని