ఎమ్మెల్యే అమిలినేని సమక్షంలో టిడిపిలో చేరిన నాలుగు వైసీపీ కుటుంబాలు.
కళ్యాణదుర్గం: బ్రహ్మసముద్రం మండలంలోని బొమ్మగానిపల్లి, బొమ్మగానిపల్లి తాండాకు చెందిన నాలుగు వైసీపీ కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. కళ్యాణదుర్గంలోని ప్రజావేదికలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు సమక్షంలో జరిగిన కార్యక్రమంలో కేశవ నాయక్, పాండు నాయక్, కిషోర్ నాయక్, రంగస్వామి పసుపు కండువాలు కప్పుకుని టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమిలినేని వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారు టీడీపీ నాయకత్వంపై విశ్వాసంతో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ సిద్ధాంతాలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ చేరికలతో బొమ్మగానిపల్లి, బొమ్మగానిపల్లి తాండా ప్రాంతాల్లో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి.