BREAKING
వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన JBKపురం మాజీ సర్పంచ్ కంచర్ల తిరుపతయ్య ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలి.. అధికారులకు ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి. పుల్లారెడ్డి ఆదేశం మండలంలో జోరందుకున్న నామినేషన్ల పర్వం ఏకగ్రీవం అభివృద్ధికి మార్గం..! చిత్రగుప్త యాప్‌పై అధికారులకు శిక్షణ.. వారం రోజుల్లో క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేయాలి.. నవంబర్ 22లోగా వివరాల నమోదు చేయాలి రెండో రోజు నామినేషన్ ల వెలువ నారన్నాయుడు వలస లో 10 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరిక వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు : జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి మధుమేహం నివారిద్దాం - ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుదాం విదేశీ ఉద్యోగాలపై నిరుద్యోగ యువతకు బంపర్‌ అవకాశం జర్మనీ, జపాన్, అమెరికా, దుబాయ్‌ సహా పలు దేశాల్లో ఉద్యోగాలు ఈ నెల 20న పెద్దపల్లిలో రిజిస్ట్రేషన్‌ మేళా శివనామస్మరణతో మార్మోగిన శైవక్షేత్రాలు రాబోయే ఎన్నికల్లో బీసీలకు అత్యధిక స్థానాలు కల్పించేందుకు బీసీ దళ్ రెడీ:తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు డి.వి.వి. సత్యనారాయణ గ్రంధాలయ ఉద్యమ నాయకులకు ఘన నివాళులు ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ను ఘనంగా నిర్వహించాలి డిసెంబర్ 11 నుంచి 22 వరకు పోటీలు

ఎల్‌నినోని పరిస్థితులను అధిగమించేందుకు ప్రత్యేక కార్యాచరణ : నీటి వనరుల సమర్థ వినియోగంతో సాగు విస్తీర్ణం పెంచాలి : నీటి సంరక్షణ,భూగర్భ జలాల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి : అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశం

Select Suryaa Now
ఎల్‌నినోని పరిస్థితులను అధిగమించేందుకు ప్రత్యేక కార్యాచరణ : నీటి వనరుల సమర్థ వినియోగంతో సాగు విస్తీర్ణం పెంచాలి : నీటి సంరక్షణ,భూగర్భ జలాల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి : అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశం

మదనపల్లె టౌన్,మేజర్ న్యూస్ : ఎల్‌నినో ప్రభావంతో భవిష్యత్తులో తలెత్తే వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని జిల్లాలో నీటి లభ్యతను పెంచడంతోపాటు,అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకుంటూ సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు.సోమవారం మదనపల్లెలోని కలెక్టరేట్ నీతి హాలులో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లాలో నీటి వనరుల అభివృద్ధి,నీటి సంరక్షణ,భూగర్భ జలాల పెంపు,సాగునీటి లభ్యత మెరుగుదల తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో వర్షపాతం తగ్గే అవకాశాలను దృష్టిలో ఉంచుకొని జిల్లాలో నీటి కొరతను అధిగమించేందుకు ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలన్నారు.ఇప్పటికే జిల్లాలో చేపట్టిన వాటర్‌షెడ్ పనులు,ఇరిగేషన్ పనులు,క్యాస్కేడ్‌ల పునరుద్ధరణ,చెరువుల అభివృద్ధి,నీటి నిలువ సామర్థ్యం పెంపు,భూగర్భ జలాల అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయాలని సూచించారు.నీటి వనరుల పునరుద్ధరణ ద్వారా వర్షపు నీటిని గరిష్ట స్థాయిలో ఒడిసిపట్టి భవిష్యత్తు అవసరాలకు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు.చెక్‌డ్యామ్‌లు,చెరువులు,కుంటలు,క్యాస్కేడ్‌లలో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడంతోపాటు,భూగర్భ జలమట్టాలు పెరిగేలా చేపట్టిన పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు.వ్యవసాయ రంగానికి అవసరమైన నీటి లభ్యతను మెరుగుపరిచి,అందుబాటులో ఉన్న నీటి వనరులకు అనుగుణంగా సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు వ్యవసాయ,ఉద్యానవన,ఇరిగేషన్,డ్వామా తదితర శాఖలు సమన్వయంతో కార్యాచరణ రూపొందించాలన్నారు.నీటిని పొదుపుగా వినియోగించే పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించాలని,సూక్ష్మ సేద్య విధానాలను ప్రోత్సహించాలని పేర్కొన్నారు.జిల్లాలో చేపట్టిన ప్రతి నీటి సంరక్షణ పనికి సంబంధించిన పురోగతి,నీటి నిల్వ సామర్థ్యంలో పెరుగుదల,భూగర్భ జలాల అభివృద్ధి,రైతులకు కలుగుతున్న ప్రయోజనాలపై స్పష్టమైన వివరాలను సంబంధిత శాఖలు సిద్ధంగా ఉంచుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.నీటి లభ్యత పెంపు,వ్యవసాయ అభివృద్ధి లక్ష్యంగా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో డ్వామా పీడీ వెంకటరత్నం,ఇరిగేషన్ రిటైర్డ్ ఎస్ఈ వెంకట్రామయ్య,వ్యవసాయ శాఖ జేడీ హరిప్రియ,ఉద్యాన శాఖ ఏడీ సుభాషిని,ఏపీఎంఐపీ, పశుసంవర్ధక,డీఆర్డీఏ పీడీలు లక్ష్మీ ప్రసన్న,గుణశేఖర్ పిళ్లై,నాగేశ్వరరావుభూగర్భ జల శాఖ ఈఈ సువర్ణ కుమార్,సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి