BREAKING
నేడే " పల్లె " పోరు నేటి రాశి ఫలాలు –5 నవంబర్, 2026 నేటి పంచాంగం 5 నవంబర్, 2026 ఓటు మన హక్కు బిజెపి ఆధ్వర్యంలో విస్తృతంగా ఇంటింటి ప్రచారం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో ఎంపీ ఆర్.కృష్ణయ్య భేటీ బీజేపీలో చేరిన కాంగ్రెస్ నాయకుడు నారాయణరెడ్డి పారిశ్రామిక అవసరాలకు శుద్ధి చేసిన నీరు: టీజీపీసీబీ దిశానిర్దేశం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం... - బుడమేరులో తగ్గిన నీటి ప్రవాహం – డ్రోన్ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ లండన్ డబ్ల్యూటీఎంలో తెలంగాణ పర్యాటక స్టాల్ ప్రారంభం వ్యయ నివేదికల సమర్పణపై దృష్టిపెట్టండి.. ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ ఎన్నిక‌ల‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు ప్రభుత్వ కార్యాలయాల ఆధునీకరణకు మంత్రి పొంగులేటికి ఎమ్మెల్యే బండారి విజ్ఞప్తి ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో పటిష్ట భద్రత క్రైస్తవుల సమస్యల పరిష్కారానికి గవర్నర్‌కు వినతి ఉప్పల్ డిగ్రీ కళాశాలకు స్థలం కేటాయించాలి: ఎమ్మెల్యే బండారి

ఎల్.కోట మండలంలో ఎమ్మెల్యే కోళ్ల విస్తృత ఎన్నికల ప్రచారం

Select Suryaa Now
ఎల్.కోట మండలంలో ఎమ్మెల్యే కోళ్ల  విస్తృత ఎన్నికల ప్రచారం

ఎల్.కోట, సూర్య : ఎల్.కోట మండలంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి మండల పరిధిలోని పలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ బలపరిచిన జెడ్పీటీసీ అభ్యర్థి కరెడ్ల ఈశ్వరరావు, ఎంపీటీసీ అభ్యర్థి పుట్ట శ్రీనివాసరావు తరఫున ఆమె ప్రజలను కలిసి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. ప్రచారంలో భాగంగా ఆమెకు గ్రామస్తులు, పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి మాట్లాడుతూ, గ్రామాల అభివృద్ధి ఒక్క తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని పేర్కొన్నారు. గ్రామస్తులు తమ విలువైన రెండు ఓట్లను సైకిల్ గుర్తుకే వేయాలని కోరారు. ఒక ఓటు ఎంపీటీసీ అభ్యర్థి పుట్ట శ్రీనివాసరావుకు, మరొక ఓటు జెడ్పీటీసీ అభ్యర్థి కరెడ్ల ఈశ్వరరావుకు వేసి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. ఎల్.కోట గ్రామ ప్రజల ఆదరాభిమానాలు ఎల్లప్పుడూ తమపై ఉంటాయని, గ్రామానికి తమ కుటుంబం ఎప్పుడూ రుణపడి ఉండి సేవ చేస్తుందని ఆమె భావోద్వేగంగా పేర్కొన్నారు.

గ్రామంలో నెలకొన్న సమస్యలన్నింటినీ ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ముఖ్యంగా తాగునీటి సమస్య లేకుండా ప్రతి వీధిలో, ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్లు ఏర్పాటు చేసే బాధ్యతను తాను స్వయంగా తీసుకుంటానని స్పష్టం చేశారు. అభ్యర్థుల గురించి ప్రస్తావిస్తూ—పుట్ట శ్రీనివాసరావు అందరికీ సుపరిచితుడైన వ్యక్తి అని, రంగరాయపురానికి చెందిన కరెడ్ల ఈశ్వరరావు మూడోసారి జడ్పీటీసీ అభ్యర్థిగా ప్రజల ముందుకు వచ్చారని గుర్తుచేశారు. ఎంపీటీసీగా శ్రీనివాసరావును గెలిపిస్తే తమ చెల్లెలు ఉషమ్మను ఎంపీపీగా బాధ్యతలు స్వీకరింపజేస్తామని, వీరందరి సహకారంతో మండలాన్ని, పంచాయతీని అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకంతో సైకిల్ గుర్తుకు ఓట్లేసి అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరారు.