ఏఎస్ పేటలో పోస్టల్ బ్యాలెట్ల జోరు జెడ్పీటీసీకి 117, ఎంపీటీసీకి 86 పోలింగ్
అనుమసముద్రంపేట, మేజర్ న్యూస్ : ఏఎస్ పేట మండలంలో గత మూడు రోజులుగా పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కొనసాగుతోంది. మంగళవారం వరకు జెడ్పీటీసీకి 117, ఎంపీటీసీకి 86 పోస్టల్ బ్యాలెట్లు నమోదయ్యాయని రిటర్నింగ్ అధికారి డి. వెంకటసుబ్బయ్య తెలిపారు. ఎన్నికల విధుల్లో ఉన్న మరికొంత మంది బీఎల్ఓలు బుధవారం మధ్యాహ్నం లోపు పోస్టల్ బ్యాలెట్లను వినియోగించుకోవాలని ఆయన కోరారు.
మండలంలో మొత్తం 41 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని, పోలింగ్ నిర్వహణ కోసం 5, రూట్లుగా విభజించినట్లు తెలిపారు. బుధవారం మధ్యాహ్నం 11:30 గంటల నుండి డిస్పాచ్ సెంటర్ అయిన మోడల్ పాఠశాల నుండి రూట్ మ్యాప్ ప్రకారం ఎన్నికల సిబ్బంది తమ తమ పోలింగ్ స్టేషన్లకు బయలుదేరుతారని పేర్కొన్నారు.