దేవనకొండ మండలం కప్పట్రాళ్ల ఎంపిపి పాఠశాల విద్యాకమిటీ చైర్మన్ ఎన్నికలు
దేవనకొండ మండలం కప్పట్రాళ్ల గ్రామంలో టిడిపి వర్సెస్ టిడిపి మధ్య శనివారం ఎంపిపి పాఠశాల విద్యాకమిటీ చైర్మన్ ఎన్నికలలో స్థానిక ఎన్నికలను తలపించాయి.రసవత్తరంగా జరిగిన ఈ ఎన్నికలలో రాష్ట్ర వాల్మీకీ చైర్మన్ బొజ్జమ్మకు భంగపాటు తప్పలేదు. బ్యాలెట్ పేపర్ ద్వారా జరిగిన ఎన్నికల్లో బొజ్జమ్మ బలపరచిన అభ్యర్థికి 81 ఓట్లు రాగా అదే గ్రామానికి చెందిన టిడిపి నాయకుడు మల్లికార్జున బలపరచిన అభ్యర్థి అలీ భాషకు 97 ఓట్లు రావడం జరిగింది.ఈ సందర్భంగా ఎన్నికల అధికారి మాట్లాడుతూ మొత్తం 178 ఓట్లు నమోదు కాగా ఇందులో 81 హరి బాబుకు 97 అలీ భాషకు రావడంతో చైర్మన్ గా అలీ భాష నియామకం కావడం జరిగిందని తెలిపారు. ఎన్నికల సందర్భంగా గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ఆలూరు సిఐ,హాలహర్వి యస్ఐ తో పాటు మరో 20 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు.