BREAKING
-నియామకమైన సందర్భంగా శ్రీ సిద్ధి గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు నూతన సుగుణ చికెన్ సెంటర్ ప్రారంభించిన మున్సిపల్ వైస్ చేర్మెన్ ప్రాచీన్ గ్లోబల్ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే జిఎంఆర్ రాష్ట్రానికి మరో తుపాను దృష్ట్యా ముందస్తు చర్యలు కూటమి అరాచక పాలనను తరిమేద్దాం --మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పిలుపు గుండె శస్త్రచికిత్స చేయించుకున్న అంజయ్యకు ఆర్థిక సహాయం అందజేసిన జిఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ బిఆర్ఎస్ నాయకులు గుర్రపు మచ్చేందర్ మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి ప్రాచీన్ గ్లోబల్ హాస్పిటల్ ప్రారంభించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ అంజిరెడ్డి గుప్తా ఫౌండేషన్ అధినేత మడుపల్లి మోహన్ గుప్తాకు పద్మశ్రీ లేదా పద్మ విభూషణ్ అవార్డు ఇవ్వాలి టిడిపి జడ్పిటిసి అభ్యర్థి శ్రీనివాసవర్మ విస్తృత ప్రచారం రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లుమారేపల్లి సొసైటీ చైర్మన్‌ రాజు బొల్లారంలో ఇందిర గాంధీ వర్ధంతి వేడుకలు గుట్టపాడులో టీడీపీ ఎన్నికల ప్రచారం బాలికకు అండగా.. బెంగళూరుకు లోకేష్ రాప్తాడు పాఠశాలలో విద్యార్థినిపై దాడి అమానుషం.. ఏపీ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయభాస్కర్

డీపీఆర్వో శ్యామ్ కుమార్ ఉద్యోగ విరమణ జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో ఘన వీడ్కోలు

Select Suryaa Now
డీపీఆర్వో శ్యామ్ కుమార్ ఉద్యోగ విరమణ జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో ఘన వీడ్కోలు

నెల్లూరు నగరం, మేజర్ న్యూస్ :    సమాచార, పౌర సంబంధాల శాఖ (ఐ అండ్ పీఆర్)లో 33 సంవత్సరాల పాటు అంకితభావంతో విశిష్ట సేవలందించి పదవీ విరమణ పొందిన జిల్లా పౌర సంబంధాల అధికారి (డీపీఆర్వో) జొన్నకూటి శ్యామ్ కుమార్‌కు నెల్లూరులో ఘనంగా వీడ్కోలు సత్కార కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ఎంప్యానల్ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ (ఏపీఈఎన్‌పీఏ) నాయకులు వల్లూరు ప్రసాద్ కుమార్, ఉడతా రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం (ఏపీజేఎఫ్) జిల్లా అధ్యక్షులు శాఖమూరి శ్రీనివాసులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, "శ్యామ్ కుమార్ గారు సమాచార శాఖలో ఎన్నో ఏళ్లుగా విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేశారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య సమర్థవంతమైన వారధిగా నిలిచి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు. అంతేకాకుండా జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో ఎల్లప్పుడూ ముందుంటూ, మీడియా ప్రతినిధులతో నిరంతరం స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించారు. సిబ్బంది స్థాయి నుంచి క్రమశిక్షణతో డీపీఆర్వో స్థాయికి ఎదిగిన ఆయన ప్రస్థానం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. తన బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేసుకుని పదవీ విరమణ చేస్తున్న ఆయన విశ్రాంత జీవితం ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో సాగాలి" అని మనసారా ఆకాంక్షించారు. అనంతరం శ్యామ్ కుమార్ గారిని శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.