దళిత కాలనీల్లో మౌలిక వసతులు కల్పించాలి
(అనంతపురం న్యూ టౌన్ రిపోర్టర్ తిరుపతి సురేష్)
నార్పల మండలం సిద్ధరాచర్ల గ్రామ దళిత కాలనీ, నార్పల అంబేద్కర్ కాలనీలో వీధి దీపాలు, మురుగు కాలువలు ఏర్పాటు చేయాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు ప్రభుదాస్ ఆధ్వర్యంలో తహసీల్దార్ అరుణకుమారికి వినతిపత్రం అందజేశారు.
సిద్ధరాచర్లలోని ఆర్డీటీ పాఠశాల సమీపంలో విద్యుత్ స్తంభం వాలిపోవడంతో తీగలు కిందికి వేలాడుతున్నాయని, విద్యార్థులకు ప్రమాదం పొంచి ఉందని తెలిపారు. నార్పల అంబేద్కర్ కాలనీలో మూడు నెలలుగా వీధి దీపాలు లేక రాత్రివేళ విషపురుగుల భయంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు.
కార్యక్రమంలో మీనుగు రామాంజనేయులు, వేదాంతం మోహన్, కడపల జయకృష్ణ, బూసి రామాంజనేయులు, పేట పెద్దిరాజులు, మీసాల రామకృష్ణ, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.