BREAKING
నేడే " పల్లె " పోరు నేటి రాశి ఫలాలు –5 నవంబర్, 2026 నేటి పంచాంగం 5 నవంబర్, 2026 ఓటు మన హక్కు బిజెపి ఆధ్వర్యంలో విస్తృతంగా ఇంటింటి ప్రచారం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో ఎంపీ ఆర్.కృష్ణయ్య భేటీ బీజేపీలో చేరిన కాంగ్రెస్ నాయకుడు నారాయణరెడ్డి పారిశ్రామిక అవసరాలకు శుద్ధి చేసిన నీరు: టీజీపీసీబీ దిశానిర్దేశం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం... - బుడమేరులో తగ్గిన నీటి ప్రవాహం – డ్రోన్ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ లండన్ డబ్ల్యూటీఎంలో తెలంగాణ పర్యాటక స్టాల్ ప్రారంభం వ్యయ నివేదికల సమర్పణపై దృష్టిపెట్టండి.. ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ ఎన్నిక‌ల‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు ప్రభుత్వ కార్యాలయాల ఆధునీకరణకు మంత్రి పొంగులేటికి ఎమ్మెల్యే బండారి విజ్ఞప్తి ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో పటిష్ట భద్రత క్రైస్తవుల సమస్యల పరిష్కారానికి గవర్నర్‌కు వినతి ఉప్పల్ డిగ్రీ కళాశాలకు స్థలం కేటాయించాలి: ఎమ్మెల్యే బండారి

చివరి రోజు హోరాహోరీగా సాగిన ఎన్నికల ప్రచారం.

Select Suryaa Now
చివరి రోజు హోరాహోరీగా సాగిన ఎన్నికల ప్రచారం.

అనపర్తి, మేజర్ న్యూస్: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అనపర్తి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చివరి రోజు హోరాహోరీగా సాగింది. మంగళవారం సాయంత్రంతో ప్రచార గడువు ముగియడంతో ప్రధాన పార్టీలైన కూటమి, వైఎస్సార్‌సీపీ నాయకులు ప్రచారంలో మరింత జోరు పెంచారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా అభ్యర్థులు, నాయకులు గ్రామాల్లో పర్యటిస్తూ ఓటర్లను కలిసి తమకు మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు.

 చివరి రోజు కావడంతో గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది. అనపర్తి మండలం పొలమూరు గ్రామంలో ఎంపీటీసీ అభ్యర్థి గుడాల దుర్గతో కలిసి కూటమి నాయకులు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కొవ్వూరు వెంకటరెడ్డి, ద్వారంపూడి ఈశ్వర్ రెడ్డి, సత్తి దేవదాన్ రెడ్డి, కర్రి జియ్యన్న రెడ్డి, మండ సత్యనారాయణరెడ్డి, కాశీ విశ్వనాథరెడ్డి తదితరులు గ్రామంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి ఓటర్లను కలుసుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ప్రజలు అండగా నిలవాలని కోరారు. గ్రామాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం లక్ష్యంగా పనిచేసే అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. 

అనపర్తి జడ్పీటీసీ స్థానంతో పాటు ఎంపీటీసీ స్థానాల్లోనూ కూటమి అభ్యర్థులకు అఖండ మెజారిటీ అందించాలని ఓటర్లను అభ్యర్థించారు. మరోవైపు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు సైతం ప్రచారంలో తమదైన శైలిలో దూసుకెళ్లారు. అనపర్తి గ్రామంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకుంటూ తమకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రచారంలో పాల్గొని అభ్యర్థుల విజయానికి కృషి చేశారు.