చల్లపల్లిలో పంచాయతీ ఎన్నికల బ్యాలెట్ పత్రాల ముద్రణ
చల్లపల్లి మేజర్ న్యూస్ : త్వరలో జరుగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల బ్యాలెట్ పత్రాలు భద్రపరిచేం దుకు చల్లపల్లి గ్రామపంచాయతీలో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేశామనీ, బ్యాలెట్ పత్రాల ము ద్రణ 50శాతం పూర్తయిందని జిల్లా పంచాయతీ అధికారిణి (డీపీవో) ఎం. ధనలక్ష్మి తెలిపారు. శనివారం చల్లపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయానికి వచ్చిన ఆమె స్థానిక విలేకర్లతో మాట్లాడారు. కృష్ణాజిల్లాలోని 491 గ్రామ పంచాయతీలు, 4780 వార్డులకు సంబంధించిన బ్యాలెట్ ముద్రణ చల్లపల్లిలో జరుగుతుందన్నారు. నవంబరు మొదటి వారంలోగా బ్యాలెట్ పేపర్ల ముద్రణ పూర్తవుతుందన్నారు. చల్లపల్లి గ్రామ పంచాయతీ పై అంతస్థులో బ్యాలెట్ పత్రాలు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్‌ను ఏర్పాటుచేశామనీ, ఎప్పటికప్పుడు ముద్రించిన బ్యాలెట్లను స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరచనున్నట్లు తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్లు వచ్చిన తర్వాత ఎన్నికల తేదీల ఆధారంగా చల్లపల్లి నుంచీ ఆయా ప్రాంతాల ఎన్నికల సిబ్బందికి బ్యాలెట్లు పంపిణీ చేయటం జరుగుతుందని వివరించారు. ఈనెల 24వ తేదీ నుంచీ బ్యాలెట్ ముద్రణ ప్రారంభించామనీ, పరిశీలన అనంతరం స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరుస్తున్నట్లు డీపీవో ధనలక్ష్మి భద్రపరచటాన్ని పరిశీలించి వివరించారు. ఈ మేరకు బ్యాలెట్ ముద్రణ, స్ట్రాంగ్‌రూమ్‌లో అధికారులు, సిబ్బందికి తగు సూచనలు అందచేశారు. డీపీవో వెంట డీఎల్పీవో ఎం డి.రాజావుల్లా, ఈవో పివి. మాధవేంద్రరావు ఉన్నారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, చల్లపల్లి నియోజకవర్గం, కృష్ణాజిల్లా.