BREAKING
నామినేషన్ కేంద్రాన్ని తనిఖీ చేసిన డిఎస్పి. కొత్తూరు మండలంలో ఆరు స్థానాల్లో జనసేన పోటీ వేం నరేందర్ రెడ్డిని కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపిన గాలి అనిల్ కుమార్ పొదలకూరులో ఎంపీటీసీ నామినేషన్ల సందడి తొలిరోజు 10 సెగ్మెంట్లకు 23 నామినేషన్లు లింగంపల్లిలో వైభవంగా దుర్గామాత ఊరేగింపు, నిమజ్జనం నేరడి ఎంపిటిసిగా కొండల రామకృష్ణ ఎమ్మెల్సీ సమావేశానికి కాంగ్రెస్ నాయకులు హాజరు కావాలి గాజువాక వైకాపా నేతలతో మేయర్ అభ్యర్థి వరుదు కళ్యాణి మర్యాదపూర్వక భేటీ చిన్నారిని ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే బొల్లం 40వ వార్డులో వైసీపీ విస్తృత ప్రచారం ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిసిన పోరాళ్ల శిల్ప, కౌన్సిలర్ అభ్యర్థి పుష్పావతి అధికారులకు ఎన్నికల శిక్షణ పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల వ్యయ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి అనంతపురం నగరపాలక సంస్థ ఎన్నికలపై మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సమాలోచనలు లక్ష్య సాధనకు సమిష్టిగా కృషి చేయాలి.. డైరెక్టర్ ఆపరేషన్స్ ఎల్.వి.సూర్యనారాయణ మిత్రుడి కుటుంబానికి ఎస్ఎస్సి బ్యాచ్ స్నేహితుల ఆర్థిక సహాయం

బొత్స సమక్షంలో కండువా కప్పుకున్న గరివిడి టీడీపీ నాయకులు

Select Suryaa Now
బొత్స సమక్షంలో కండువా కప్పుకున్న గరివిడి టీడీపీ నాయకులు

చీపురుపల్లి  అక్టోబర్ 21 మేజర్ న్యూస్: గరివిడి మండలంలో ఎన్నికల సందర్భంగా ఒక్కసారిగా రాజకీయ సమీకరణలు మారాయి.  టీడీపీ మెరకముడిదాం మండల అధ్యక్షుడు, గరివిడి క్లస్టర్ పర్యవేక్షకులు రెడ్డి గోవింద్ అతని భార్య భారతి బుధవారం టీడీపీ వీడి వైసీపీలో చేరారు.  చీపురుపల్లిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శాసనమండలి విపక్ష నేత  బొత్స సత్యనారాయణ   సమక్షంలో గరివిడికి చెందిన సుమారు 200 కుటుంబాలు వైసీపీలో చేరారు. భీమిలి సమన్వయకర్త డాక్టర్ బొత్స అనూష, బొత్స సందీప్, గరివిడి  మండల పార్టీ అధ్యక్షుడు విశ్వేశ్వరరావు లతో కలిసి కొత్తగా చేరిన వారికి బొత్స సత్యనారాయణ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.

పార్టీలో చేరిన వారిలో మాజీ ఎంపీటీసీలు వలిరెడ్డి బాజ్జీ, బమ్మిడి నర్సయ్య, వైగాళ సత్యం, మాజీ వార్డు మెంబర్ కిరణ్, యువజన నాయకుడు చిన పైడి నాయుడు, యాదవ సంఘ నాయకులు వైగాల శ్రీను, వైగాల రమేష్ ఉన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గంలో వైసీపీ శ్రేణులు ఐక్యంగా పనిచేయాలని ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మీసాల వరహాల నాయుడు, ఇప్పిలి అనంత్, అప్పలస్వామి, కార్తీక్, పలువురు మాజీ సర్పంచులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. 

మధు, సూర్య చీపురుపల్లి విజయనగరం జిల్లా