బిసి లకు 34 శాతం రిజర్వేషన్ పట్ల హర్షం
బిసి లకు 34 శాతం రిజర్వేషన్ పట్ల హర్షం
చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం
కనిగిరి ,మేజర్ న్యూస్ :స్థానిక సంస్థల ఎన్నికలలో బీసి లకు 34 శాతం రిజర్వేషన్ కల్పించాలన్న హామీకి కట్టుబడి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల టీడీపి నాయకులు ,బిసి సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు .ఆదివారం స్థానిక అమరావతి గ్రౌండ్ లో సీఎం నారా చంద్రబాబు నాయుడు చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు .ఈ సంధర్భంగా పలువురు మాట్లాడుతూ టిడిపి ఆవిర్భావం నుండి బిసి లకు తగిన ప్రాధాన్యం కల్పిస్తుందన్నారు .1987 లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసి లకు 20 శాతం ,1995 లో 34 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత టీడీపి కి దక్కుతుందన్నారు .దివంగత ఎన్టీ రామారావు బిసీలకు రాజకీయ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశ్యంతో రిజర్వేషన్లకు ప్రాధాన్యం ఇచ్చారని అనంతరం చంద్రబాబు నాయుడు బీసి లకు రిజర్వేషన్లు 34 శాతం పెంచేందుకు కృషి చేసారని పేర్కొన్నారు .బీసి ల రాజకీయ ఎదుగుదలకు అవకాశాలు కల్పిస్తున్న టీడిపి కి అండగా నిలవాలని కోరారు .ఈ సంధర్భంగా సీఎం చంద్రబాబు నాయుడుకు కృతఙ్ఞతలు తెలియజేశారు .ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బొబ్బూరి రమేష్ ,సానికొమ్ము తిరుపతిరెడ్డి ,ఏనుగంటి శ్రీనివాసులు ,బొల్లా నరసింహారావు ,రాచమళ్ళ పట్టణ టిడిపి అధ్యక్షులు షేక్ ఫిరోజ్ ,రాచమళ్ళ శ్రీనివాసులు రెడ్డి ,నియోజకవర్గం బిసి సెల్ అధ్యక్షులు గంజి శ్రీనివాసులు ,ఎన్ అంజినాయుడు ,నంబుల వెంకటేశ్వర్లు గవదకట్ల మాలకొండయ్య ,చింతలపూడి తిరుపాలు ,షేక్ రహీమాన్ ,రోషన్ సంధాని ,పెన్నా కొండలు ,బుల్లా బాలబాబు ,చీర్ల నాగార్జున యాదవ్ ,బారా ఇమామ్ ,షేక్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు .