BREAKING
ప్రాచీన్ గ్లోబల్ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే జిఎంఆర్ రాష్ట్రానికి మరో తుపాను దృష్ట్యా ముందస్తు చర్యలు కూటమి అరాచక పాలనను తరిమేద్దాం --మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పిలుపు గుండె శస్త్రచికిత్స చేయించుకున్న అంజయ్యకు ఆర్థిక సహాయం అందజేసిన జిఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ బిఆర్ఎస్ నాయకులు గుర్రపు మచ్చేందర్ మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి ప్రాచీన్ గ్లోబల్ హాస్పిటల్ ప్రారంభించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ అంజిరెడ్డి గుప్తా ఫౌండేషన్ అధినేత మడుపల్లి మోహన్ గుప్తాకు పద్మశ్రీ లేదా పద్మ విభూషణ్ అవార్డు ఇవ్వాలి టిడిపి జడ్పిటిసి అభ్యర్థి శ్రీనివాసవర్మ విస్తృత ప్రచారం రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లుమారేపల్లి సొసైటీ చైర్మన్‌ రాజు బొల్లారంలో ఇందిర గాంధీ వర్ధంతి వేడుకలు గుట్టపాడులో టీడీపీ ఎన్నికల ప్రచారం బాలికకు అండగా.. బెంగళూరుకు లోకేష్ రాప్తాడు పాఠశాలలో విద్యార్థినిపై దాడి అమానుషం.. ఏపీ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయభాస్కర్ కక్షిదారులకి సత్వరమే న్యాయం అందలి -- తెలంగాణ రాష్ట్ర గౌరవ హై కోర్టు జర్జి గాడి ప్రవీణ్ కుమార్ బస్ డిపో కై స్థలాన్ని కేటాయించాలి

బిరదవోలు, కళ్యాణపురంలో సుమలత ప్రచార హోరు!

Select Suryaa Now
బిరదవోలు, కళ్యాణపురంలో సుమలత ప్రచార హోరు!

పొదలకూరు,  మేజర్ న్యూస్ :    పరిషత్ ఎన్నికల నేపథ్యంలో పొదలకూరు మండలం బిరదవోలు ఎంపీటీసీ సెగ్మెంట్ టీడీపీ అభ్యర్థిని అన్నలూరు సుమలత ప్రచారాన్ని ముమ్మరం చేశారు. బిరదవోలు, కళ్యాణపురం గ్రామాల్లో టీడీపీ నాయకులతో కలిసి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నవంబర్ 5న జరగనున్న ఎన్నికల్లో తనతో పాటు జెడ్పీటీసీ అభ్యర్థి కలిచేటి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని ఇంటింటికీ వెళ్లి ప్రజలను అభ్యర్థించారు.ఈ సందర్భంగా ఎంపీటీసీ అభ్యర్థిని సుమలత మాట్లాడుతూ తనను ఆదరించి గెలిపిస్తే సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సహకారంతో బిరదవోలు ఎంపీటీసీ సెగ్మెంట్ పరిధిలోని అన్ని గ్రామాల అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు.

కూటమి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రచారం

కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ టీడీపీ నాయకులు ప్రచారం నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని వివరించారు. స్థానిక సంస్థలు బలోపేతమైతేనే గ్రామాలకు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేరుతాయని పేర్కొన్నారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి సహకారంతో బిరదవోలు సెగ్మెంట్‌లో అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్లేందుకు టీడీపీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు.బిరదవోలు, కళ్యాణపురం గ్రామాల్లో టీడీపీ ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని పార్టీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగు యువత అధ్యక్షుడు వెన్నపూస రాజశేఖర్ రెడ్డి, టీడీపీ నాయకులు అన్నలూరు చెన్నకృష్ణమ నాయుడు, వెన్నపూస రమణారెడ్డి, అక్కెం బుజ్జిరెడ్డి, ఎత్తపు వెంకటరెడ్డి, రావుల శ్రీనివాసులు గౌడ్, రావుల భాస్కర్ గౌడ్, బడుగు సూర్యనారాయణ, వంపులూరు శ్రీనివాసులు గౌడ్, బీజేపీ నాయకులు ముక్కు రామయ్య గౌడ్ తదితరులతో పాటు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.