బీవీ మిత్రధర్మం పాటించలేదు..జనసేన నేత చల్లా
ఎమ్మిగనూరు సూర్య ప్రతినిధి
ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మునిసిపాలిటీ, జడ్పిటిసి ఎంపిటిసి స్థానాలను కేటాయించడంలో కూటమి ధర్మం పాటించకుండా ఇక్కడ ఎమ్మెల్యే బి వి జయ నాగేశ్వర్రెడ్డి ధర్మానికి తూట్లు పొడిచారని జనసేన నాయకులు చల్లా వరుణ్ మండిపడ్డారు ఆయన సామాజిక మధ్య లో సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. ఈ అంశంపై రాజకీయ దుమారం చల రేగుతుంది.
ఎమ్మిగనూరులో జరిగిన ఎన్నికల్లో కూటమి ధర్మానికి అనుగుణంగా సహకారం అందకపోవడం వల్ల ఐదుగురు కౌన్సిలర్లు, ఏడుగురు ఎంపీటీసీ అభ్యర్థులతో పాటు ఒక జెడ్పీటీసీ అభ్యర్థి ఓటమి పాలయ్యారని జనసేన నేత చల్లా వరుణ్ ఆరోపించారు.
కూటమిలో భాగస్వామ్య పక్షంగా ఉన్న జనసేన అభ్యర్థులకు తగిన సహకారం అందలేదన్నది వారి ప్రధాన ఆరోపణగా తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో జనసేన నాయకుల ఆరోపణలపై ఎమ్మెల్యే జయ నాగేశ్వరరెడ్డి ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు స్థానిక రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
ఈ ఆరోపణలపై ఎమ్మెల్యే స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి.
A R శరత్ కుమార్ సూర్య ప్రతినిధి ఎమ్మిగనూరు కర్నూలు జిల్లా