BREAKING
నేటి రాశి ఫలాలు 13 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 13 అక్టోబర్ 2026 అల్లర్లకు పాల్పడితే ఉపేక్షించేది లేదు యువతను మోసం చేసిన కాంగ్రెస్ కు పట్టభద్రులు బుద్ధి చెప్పాలి మండల అభివృద్ధిపై సర్వసభ్య సమావేశం దర్యాప్తులో జాప్యం వద్దు.. విధుల్లో అప్రమత్తంగా ఉండాలి జానేష్ కుమార్ ను విధుల నుండి తొలగించాలి చుక్కలు చూపిస్తున్న బుకింగ్స్: ఢిల్లీ చారిత్రక 'రామ్‌లీలా మైదానం'లో ఈ ఏడాది మిగిలింది కేవలం 3 రోజులే.. కారణాలు ఇవే! యూఎస్ ‘పెర్మ్’ నిలిపివేతతో మాపై ఎలాంటి ప్రభావం ఉండదు: తేల్చిచెప్పిన హెచ్‌సీఎల్‌టెక్.. కారణాలు ఇవే! సముద్రాలలో నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి స్టార్‌లింక్ స్టేషన్ దగ్ధం కేసు...జర్మనీలో ఇద్దరు టర్కీ పౌరుల అరెస్ట్ సౌదీ అరేబియా వ్యూహాత్మక అడుగు: హార్ముజ్ జలసంధిపై ఆధారపడటం తగ్గించేలా.. పైప్‌లైన్ సామర్థ్యం 10 మిలియన్ బ్యారెళ్లకు పెంపు! విడుదల ముందే ఏఐ మోడళ్ల భద్రతా సమీక్ష: ట్రంప్ విధానాన్ని తిరస్కరిస్తూ యూకే ప్రభుత్వం కీలక నిర్ణయం! ఉత్తర ఇజ్రాయెల్‌లో పేలిన బాంబు సవాళ్లను దాటి భారత్‌పైనే వాల్‌స్ట్రీట్ గురి: భారీ పెట్టుబడులు, విస్తరణకు అంతర్జాతీయ బ్యాంకింగ్ దిగ్గజాల కసరత్తు!

బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై స్పష్టతనివ్వాలి

Select Suryaa Now
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై స్పష్టతనివ్వాలి


- స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి బీసీలు సిద్ధం కావాలి
- బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తున్న రాజకీయ పార్టీలు
- పేద ప్రజకు మెరుగైన వైద్యం అందని ద్రాక్షే
- బిసిహెచ్ పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు బోడెం రాజశేఖర్ ఆరోపణలు
మదనపల్లె,మేజర్ న్యూస్ : త్వరలో జరుగబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం ప్రకటించడం కేవలం బిసిలను మభ్యపెట్టడమేనని బిసి హక్కుల పోరాట సమితి (బిసిహెచ్ పిఎస్) రాష్ట్ర అధ్యక్షులు బోడెం రాజశేఖర్ పేర్కొన్నారు.ఆదివారం పట్టణంలోని మదనపల్లె ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో బిసి నేతలతో కలిసి ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా బోడెం రాజశేఖర్ మాట్లాడుతూ బిసిలు తరతరాలుగా మోసపోతున్నారన్నారు.బిసిలకు 47 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కొన్నిసంవత్సరాలుగా తాము పోరాటం కొనసాగిస్తున్నామని,దీనిపై గతప్రభుత్వానికి,ప్రస్తుత ప్రభుత్వానికి వినతిపత్రాలు సమర్పించామని అయితే ఎవరూ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు పూర్తయిందని,ఇన్నాళ్లుగా గుర్తుకురాని బిసిలు స్థానిక సంస్థల ఎన్నికలు నోటిఫికేషన్ సమీపిస్తున్న వేళ 34 శాతం రిజర్వేషన్లు అంటూ ముఖ్యమంత్రి హడావిడి చేస్తున్నారని విమర్శించారు.సుప్రీం కోర్టు 34 శాతం రిజర్వేషన్లు పిటిషన్ కొట్టివేసిందని,అయితే ముఖ్యమంత్రి,కూటమి నేతలు 34 శాతం రిజర్వేషన్ ఎలా అమలు చేస్తారో స్పష్టతనివ్వాలని సూటిగా ప్రశ్నించారు.రిజర్వేషన్ బిల్లుకు పార్లమెంటులో చట్టబద్ధత ఆయన కల్పించాలని డిమాండ్ చేశారు.నామినేటెడ్ పదవులు కేటాయింపులో బిసిలకు తీవ్రఅన్యాయం జరిగిందని,కనీసం స్థానిక సంస్థల ఎన్నికల్లోనైనా అధిక సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.త్వరలోనే బిసిలకు రాజ్యాధికారం కల సాకారం చేసే ఓ బలమైన పార్టీ రాబోతుందని స్పష్టం చేశారు.ఇప్పటికైనా రాజకీయ ప్రాధాన్యతను కల్పించాలని,లేనియెడల బిసిల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.ఇక పోతే సామాన్య ప్రజలకు మెరుగైన వైద్యం అందని ద్రాక్షగా మారిందన్నారు.మదనపల్లె జిల్లా ఆసుపత్రిలో పరిస్థితి దారుణంగా ఉందన్నారు.సరైన వైద్యం అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.వైద్యులు మానవతా దృక్పథంతో రోగులకు చికిత్సలు అందించాలని హితవు పలికారు.ఈ కార్యక్రమంలో బిసిహెచ్ పిఎస్ నాయకులు శేషాద్రి నాయుడు,కరామత్ బాషా,రాజు స్వామి,సుబ్బరాజు,పోతబోలు వెంకటరమణ,నాగేంద్ర కుమార్,కార్తీక్ స్వామి,గౌతమ్ స్వామి,షాహిద్ షా,శ్రీనివాసులు,మునికుమార్ తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్ : కె.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లె నియోజకవర్గం ఇంచార్జి