బాలిగం వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థి దుబ్బ కృష్ణారావును గెలిపించాలి - కర్రి గోపాల్ పిలుపు.
మందస మండలంలో వైసీపీకి మద్దతుగా ప్రచారం - పంచాయతీరాజ్ విభాగం నేతల విస్తృత పర్యటన.
పలాస/మందస,నవంబర్ 3,మేజర్ న్యూస్.
మందస మండలం బాలిగం ఎంపీటీసీ స్థానంలో వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న దుబ్బ కృష్ణారావును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వైఎస్ఆర్సిపి పంచాయతీ రాజ్ వింగ్ పలాస నియోజకవర్గ అధ్యక్షులు, వీరగున్నమ్మపురం మాజీ సర్పంచ్ కర్రి గోపాల్ పిలుపునిచ్చారు.మందస మండలం బాలిగం గ్రామంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే పంచాయతీలకు నిధులు, గ్రామాలకు అభివృద్ధి జరిగిందని, సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరాయని గుర్తు చేశారు. బాలిగం గ్రామ అభివృద్ధి కోసం, పేదల సంక్షేమం కోసం వైసీపీ అభ్యర్థి దుబ్బ కృష్ణారావును గెలిపించడం అవసరమని కోరారు.కూటమి ప్రభుత్వం వచ్చాక పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేశారని, గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందని ఆయన విమర్శించారు. మళ్లీ గ్రామాల్లో వైసీపీ హవా కొనసాగించాలంటే ఎంపీటీసీ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి దుబ్బ కృష్ణారావును గెలిపించాలని గ్రామస్తులను కోరారు. ప్రచారంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.