BREAKING
పెరిగిన బియ్యం ధరలను తక్షణమే అదుపు చేయాలి నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి నేడు ప్రజావాణి కార్యక్రమం విప్పమనుపట్టెడ సర్పంచ్ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి గ్రామస్థుడి ఫిర్యాదు అమెరికాలో మూడో రోజు కొనసాగుతున్న విమాన ప్రయాణాల అంతరాయం విజ్ఞాన సమాజమే దేశ అభివృద్ధికి పునాది రష్యా కుట్రల నేపథ్యంలో డిసెంబర్ 1 నుండి సరిహద్దులను మూసివేయనున్న ఎస్టోనియా 16న పిల్లల ప్రజావాణి సింగపూర్, మలేషియా దేశాలకు క్షమాపణలు తెలిపిన ఇండోనేషియా అధ్యక్షుడు బాల్ బ్యాడ్మింటన్ జిల్లా అధ్యక్షులుగా గూట్ల తిరుపతి హూతీ వ్యతిరేక బలగాల వెనుకంజ, బహ్రెయిన్‌పై ఇరాన్ దాడుల కలకలం అర్హులైన ప్రతి ఒక్కరికి పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యం-పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి రొంపిచెర్ల సర్పంచ్ బరిలో షేక్ షబానా ఆజ్మీ. మంత్రి సీతక్కకు స్వాగతం పలికిన ఇనగాల మర్రిపాడు .సి .లో పోలీసులు పల్లెనిద్ర

బాలల దినోత్సవం సందర్భంగా మున్సిపల్ పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు

Select Suryaa Now
బాలల దినోత్సవం సందర్భంగా మున్సిపల్ పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు

​కావలి, మేజర్ న్యూస్ :    బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని కావలి పట్టణంలోని మున్సిపల్ పాఠశాలలో శనివారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. కావలి మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఏ. గీతావాణి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరిగింది. ​సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ జి. విక్రమ్ సిన్హా మాట్లాడుతూ, విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే క్రమశిక్షణ, వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ ఉన్నత చదువులకు పునాదులు వేసుకోవాలని సూచించారు. 12 ఏళ్ల లోపు పిల్లలందరూ తప్పనిసరిగా బడిలోనే ఉండాలని, విద్యా హక్కు చట్టంపై అవగాహన పెంచుకుని కష్టపడి చదువుకోవడం ద్వారా ఉన్నత శిఖరాలకు చేరుకుని తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. బడి బయట ఉన్న పిల్లలను కూడా పాఠశాలల్లో చేర్పించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ​ఈ కార్యక్రమంలో లీగల్ ఎయిడ్ సభ్యులు ఐ. సాయి ప్రసాద్, లోక్ అదాలత్ సభ్యులు ఎం. మాలకొండారెడ్డి, మహిళా న్యాయవాది వి. జయలక్ష్మి, మహిళా పోలీసులు, పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.