-బాలా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిచ్చిన జగత్ జాననీ
ఎమ్మిగనూరు, సూర్య ప్రతినిధి
పట్టణంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. పట్టణంలోని వీవర్స్ కాలనీ మైదానంలో శ్రీ స్వామి వివేకానంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు.
ఈ సందర్భంగా అమ్మవారికి కుంకుమార్చన, అభిషేకాలు, మహా మంగళహారతి తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు అవసరమైన ఏర్పాట్లు చేశారు.
ఈ కార్యక్రమంలో సంస్థ నిర్వాహకులు తిరుమల, జగదీష్, సూరి చంద్ర, ఈశ్వర, భార్గవ్, రఘు, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.