BREAKING
నెల్లూరు రూరల్ ఏకగ్రీవమైన పంచాయితీలు ఇందిరమ్మ బీమాను సద్వినియోగం చేసుకోవాలి… తాగునీరు, పారిశుద్ధ్య పనులను సమన్వయంతో వేగవంతం చేయాలి సొంతింటి కలను సాకారం చేసుకోవాలి. సర్పంచ్ రాణి మల్లేశం అయ్యప్పకు ఘనంగా మండల పూజలు ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న 'మయూఖ'.. ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్‌లో టాప్ ట్రెండింగ్ నార్త్ రాజుపాలెం 10వ వార్డులో ఎన్నికల వివాదం.. వికాస్ వివాహ వేడుకకు విచ్చేసిన అతిథులకు కంచర్ల భాస్కరరావు కృతజ్ఞతలు రాజ‌ధానిలో ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్(FSI) పెంపుపై మంత్రి నారాయ‌ణ స‌మీక్ష‌ లోక్‌సభ సీట్ల 50% పెంపు చరిత్రాత్మక నిర్ణయం: సీఎం చంద్రబాబు రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి నెల్లూరు జిల్లా యూత్ కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు.. నూతన అధ్యక్షుడిగా ఆలీ ఎమ్మెల్సీ ముసాయిదా ఓటర్ల జాబితాను రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందజేత విద్యార్థి దశ నుండి మాదకద్రవ్యాలపై అవగాహన అవసరం రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు పోలింగ్ సిబ్బంది కేటాయింపు పూర్తి

అన్నవరం దేవస్థానంలో అభివృద్ధి పనులపై ఈవో లక్ష్మీ శివజ్యోతి పర్యవేక్షణ

Select Suryaa Now
అన్నవరం దేవస్థానంలో అభివృద్ధి పనులపై ఈవో లక్ష్మీ శివజ్యోతి పర్యవేక్షణ
  • మెయిన్ క్యాంటీన్‌ను డార్మెంటరీగా మార్పు.
  • ప్రసాద్ పథకం ద్వారా నూతన అన్నదాన భవనం పనుల పరిశీలన

అన్నవరం, మేజర్ న్యూస్ :

కాకినాడ జిల్లా అన్నవరం ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో భక్తులకు మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు అభివృద్ధి పనులను వేగవంతం చేసే దిశగా అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఇందులో భాగంగా దేవస్థాన కార్యనిర్వహణాధికారిణి (ఈవో) శ్రీమతి లక్ష్మీ శివజ్యోతి దేవస్థాన పరిధిలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు.
దేవస్థానంలోని మెయిన్ క్యాంటీన్‌ను డార్మెంటరీగా మార్పు చేయడం జరిగింది. ఈ డార్మెంటరీ వెనుక భాగంలో మహిళలు, పురుషుల కోసం ప్రత్యేకంగా బాత్రూమ్‌ల నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఈ పనులను ఈవో పరిశీలించి నిర్మాణాల పురోగతిని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన సదుపాయాలను మెరుగుపరచాలని సూచించారు.
అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ ప్రసాద్ (PRASHAD) పథకం ద్వారా నూతనంగా నిర్మిస్తున్న అన్నదాన భవనాన్ని కూడా ఈవో లక్ష్మీ శివజ్యోతి పరిశీలించారు. భవన నిర్మాణ పనుల ప్రస్తుత పరిస్థితిని, పనుల పురోగతిని సమీక్షించారు. భక్తులకు మరింత మెరుగైన వసతులతో అన్నప్రసాదం అందించేందుకు చేపడుతున్న ఈ భవన నిర్మాణాన్ని నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని సూచించారు.
దూర ప్రాంతాల నుంచి స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు వసతి, మరుగుదొడ్లు, అన్నదాన సౌకర్యాలు మరింత మెరుగుపడేలా దేవస్థానంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ఈవో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్మాణ పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ, పనులు సకాలంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. 
ఈ అభివృద్ధి పనులు అందుబాటులోకి వస్తే అన్నవరం వచ్చే భక్తులకు మరింత సౌకర్యవంతమైన వసతి, మెరుగైన సేవలు అందనున్నాయి.