BREAKING
నేడే " పల్లె " పోరు నేటి రాశి ఫలాలు –5 నవంబర్, 2026 నేటి పంచాంగం 5 నవంబర్, 2026 ఓటు మన హక్కు బిజెపి ఆధ్వర్యంలో విస్తృతంగా ఇంటింటి ప్రచారం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో ఎంపీ ఆర్.కృష్ణయ్య భేటీ బీజేపీలో చేరిన కాంగ్రెస్ నాయకుడు నారాయణరెడ్డి పారిశ్రామిక అవసరాలకు శుద్ధి చేసిన నీరు: టీజీపీసీబీ దిశానిర్దేశం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం... - బుడమేరులో తగ్గిన నీటి ప్రవాహం – డ్రోన్ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ లండన్ డబ్ల్యూటీఎంలో తెలంగాణ పర్యాటక స్టాల్ ప్రారంభం వ్యయ నివేదికల సమర్పణపై దృష్టిపెట్టండి.. ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ ఎన్నిక‌ల‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు ప్రభుత్వ కార్యాలయాల ఆధునీకరణకు మంత్రి పొంగులేటికి ఎమ్మెల్యే బండారి విజ్ఞప్తి ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో పటిష్ట భద్రత క్రైస్తవుల సమస్యల పరిష్కారానికి గవర్నర్‌కు వినతి ఉప్పల్ డిగ్రీ కళాశాలకు స్థలం కేటాయించాలి: ఎమ్మెల్యే బండారి

అనంతగిరి మండలంలో ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు- ఎన్నికల నిర్వహణ అధికారి డాక్టర్ స్వామి నాయుడు

Select Suryaa Now
అనంతగిరి మండలంలో ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు- ఎన్నికల నిర్వహణ అధికారి డాక్టర్ స్వామి నాయుడు

 

49 పోలింగ్ కేంద్రాలు..

38,286 మంది ఓటర్లు..

ఎన్నికల విధులకు 353 మంది సిబ్బంది కేటాయింపు

అనంతగిరి,నవంబర్ 3,మేజర్ న్యూస్ :

అనంతగిరి మండల పరిషత్ పరిధిలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మండల పరిధిలో మొత్తం 49 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయగా, 38,286 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

మొత్తం ఓటర్లలో 18,786 మంది పురుషులు, 19,499 మంది మహిళలు, ఒకరు ఇతర కేటగిరీకి చెందిన ఓటర్లు ఉన్నారు.

ఎన్నికల విధులకు 353 మంది సిబ్బంది  70 పోలింగ్ సిబ్బందిని వినియోగిస్తున్నట్లు ఎన్నికల అధికారి డాక్టర్ స్వామి నాయుడు తెలిపారు.

ఎన్నికల విధుల నిర్వహణ కోసం మొత్తం 353 మంది సిబ్బందిని కేటాయించగా  వీరిలో 294 మంది రెగ్యులర్ సిబ్బంది కాగా, 59 మంది రిజర్వ్ సిబ్బందిగా అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు .- ప్రిసైడింగ్ అధికారులు  49 మంది,అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు  49 మంది
,ఇతర పోలింగ్ అధికారులు  196 మంది,రిజర్వ్ సిబ్బంది 59 మంది ఉంటారన్నారు.

అదేవిధంగా ఎన్నికల పర్యవేక్షణకు 6 మంది జోనల్ అధికారులు, 14 మంది రూట్ అధికారులు విధులు నిర్వహించనున్నట్లు అయన తెలిపారు.

రవాణా సౌకర్యాల ఏర్పాటు

ఎన్నికల విధుల నిర్వహణకు అవసరమైన రవాణా సౌకర్యాల్లో భాగంగా 3 బస్సులు, 37 జీపులను సిద్ధం చేశామన్నారు.

మధ్యాహ్నం 3 గంటలకే పోలింగ్ ముగిసే కేంద్రాలు:

మండలంలోని కొన్ని పంచాయతీల పరిధిలో ఉన్న పోలింగ్ కేంద్రాల్లో మధ్యాహ్నం 3 గంటలకే పోలింగ్ ముగియనుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

1. పెదకోట: 41, 42, 43 పోలింగ్ కేంద్రాలు – 3 కేంద్రాలు.
2. పినకోట: 46, 47 పోలింగ్ కేంద్రాలు – 2 కేంద్రాలు.
3. కివర్ల: 44, 45 పోలింగ్ కేంద్రాలు – 2 కేంద్రాలు.
4. రొంపల్లి: 9, 10 పోలింగ్ కేంద్రాలు – 2 కేంద్రాలు.
5. ప్రతి 10 పోలింగ్ స్టేషన్ కు ఒక కంట్రోల్ కమాండింగ్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది.
6. 30 పోలింగ్ స్టేషన్లకు వీడియోగ్రఫీ
7. 19 పోలింగ్ స్టేషన్లకు వెబ్ కాస్టింగ్ 
8. పోస్టల్ బాలట్ 137 పోలవడం జరిగింది.

100 శాతం ఓటర్ స్లిప్పుల పంపిణి

మండలంలోని బీఎల్ఓల ద్వారా  ఓటర్ స్లిప్పుల పంపిణీ జరుగుతుందని  అధికారులు వెల్లడించారు.

ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామని ఎన్నకల నిర్వహణ అధికారి డాక్టర్ స్వామి నాయుడు తెలియజేశారు.