BREAKING
చిత్రలేఖనం పోటీల్లో జిల్లా స్థాయిలో ప్రధమ, తృతీయ స్థానాలు మార్కెట్ కమిటీ పాలకవర్గ సమావేశం.. పాల్గొన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య సీఎంఆర్‌ఎఫ్‌ నిరుపేదలకు ఒక వరం:మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గడ్డం అనన్య వ్యాపారుల నుంచి రఘునాథ్ డబ్బులు తీసుకున్నారంటూ చేసిన ఆరోపణలను నిరూపించాలి మంచినీటి సమస్య పరిష్కారం కోసం 13 కిలోమీటర్ల పాదయాత్ర వీఆర్సీ గ్రౌండ్ అభివృద్ధికి శ్రీకారం! జలసిరి నీటి కుంటల్లో గంగపుత్రులకు చేపల పెంపకానికి అవకాశం కల్పించాలి వరుణ దేవుని యాగం లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే ముత్తుముల నెల్లూరు నగర కార్పొరేషన్ ఎన్నికల నగారా మోగడంతో వైఎస్సార్సీపీలో టికెట్ల కోసం పోటీ నెలకొంది. శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు కరెంటు బిల్లుల భారంపై హరీశ్‌రావు ఫైర్: "పండుగల ముందు ప్రజలకు పిడుగు లాంటి వార్త" కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణం సాధించిన శంకు కృపారావుకు వర్ల రామయ్య అభినందనలు పొదలకూరు శ్రీ పోలేరమ్మ జాతరకు ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు మాల్తుమ్మెద సొసైటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం బొగ్గు లైన్లో నివసించే ప్రతి ఒక్కరికి రెండు సెంట్ల ఇండ్ల స్థలం ఇచ్చి, ఇల్లు నిర్మించి ఇవ్వాలి- మంత్రి ఫరూక్ కి సిపిఎం వినతి

ఆంగ్లేయుల వెన్నుల్లో వణుకు పుట్టించిన యోధుడు వడ్డె ఓబన్న

Select Suryaa Now
ఆంగ్లేయుల వెన్నుల్లో వణుకు పుట్టించిన యోధుడు వడ్డె ఓబన్న


- ఐపిసిపి జాతీయ ప్రధాన కార్యదర్శి ఓర్సు వీరభాస్కర్ ప్రశంసలు 
మదనపల్లె : రేనాటి వీరుడు,స్వాతంత్ర్య సమరయోధుడు,ధైర్యసాహసాలకు ప్రతీక వడ్డె ఓబన్న వర్ధంతిని మంగళవారం ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ చేనేత ఓబిసి ఛైర్మన్,జాతీయ ప్రధాన కార్యదర్శి ఓర్సు వీరభాస్కర్ ఆధ్వర్యంలో పట్టణంలో రింగ్ రోడ్డు కూడలిలో ఘనంగా జరుపుకున్నారు.ఇందులో భాగంగా వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఓర్సు వీరభాస్కర్ మాట్లాడుతూ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనకు వ్యతిరేకంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి నాయకత్వంలో జరిగిన సాయుధ పోరాటంలో వడ్డె ఓబన్న కీలక పాత్ర పోషించారు.వడ్డెరలు,బోయలు,చెంచులతో కూడిన పోరాట బృందాలను సమన్వయం చేస్తూ బ్రిటిష్ బలగాలకు వ్యతిరేకంగా గెరిల్లా పద్ధతిలో ధైర్యంగా పోరాడారని కొనియాడారు.1846లో కోవెలకుంట్ల సబ్‌ ట్రెజరీపై జరిగిన దాడి సహా అనేక పోరాటాల్లో ఆయన తన వీరత్వాన్ని చాటుకున్నారన్నారు.చివరకు 1846 అక్టోబర్ 6న జగన్నాథకొండ వద్ద జరిగిన పోరాటంలో వీరమరణం పొందారన్నారు.వడ్డె ఓబన్న త్యాగం కేవలం వడ్డెర సమాజానికే కాదు,తెలుగు ప్రజలందరికీ గర్వకారణమన్నారు.ఆయన ధైర్యం,ఆత్మగౌరవం,దేశం కోసం చేసిన త్యాగం నేటి యువతకు స్ఫూర్తిగా నిలవాలన్నారు.అణచివేతకు తలవంచకుండా స్వేచ్ఛ కోసం పోరాడిన మహావీరుడు వడ్డె ఓబన్న అని,ఆయన చరిత్రను ప్రతి ఒక్కరికీ తెలియజేయడం మన బాధ్యత అన్నారు.ఆయన ఆశయాలు,పోరాట స్ఫూర్తిని నేటి తరానికి అందించాలన్నారు.వడ్డె ఓబన్న ఆశయసాధనకు కృషి చేద్దామని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వడ్డెర సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాయచోటి వెంకటసుబ్బయ్య,జిల్లా గౌరవ అధ్యక్షులు గొడ్డెల్లా రమణయ్య(వార్త),జిల్లా వడ్డెర సంక్షేమ సంఘం జిల్లా యువత అధ్యక్షులు నంద్యాల నాగరాజు,వడ్డెర సంక్షేమ సంఘం జిల్లా గౌరవ సలహాదారు బత్తుల పవన్,మాజీ అధ్యక్షులు ఇరగదిడ్ల గురుప్రసాద్,వడ్డెర సంక్షేమ సంఘం జిల్లా నాయకులు చల్లా మధు,మంజుల రామక్రిష్ణ,బత్తుల గోపి,ఆర్.రచయ్య,తమ్మిశెట్టి వేణు,అల్లం రమణ,రంగనాయకులు,డేరంగుల లక్ష్మినారాయణ,కొర్రపొతుల వాసు,వేముల వెంకటసుబ్బయ్య,గొడ్డెల్ల ఆంజనేయులు,తమ్మిశెట్టి సుబ్బయ్య,తమ్మిశెట్టి సుబ్బారాయుడు,తమ్మిశెట్టి వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.