andhrapradesh
చిత్రలేఖనం పోటీల్లో జిల్లా స్థాయిలో ప్రధమ, తృతీయ స్థానాలు
నగరం, మేజర్ న్యూస్: మండల పరిధిలోని ఉల్లిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏడవ తరగతి విద్యార్థి పాముల శ్రీలక్ష్మి జూనియర్స్ విభాగంలో జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలోను, తొమ్మిదవ తరగతి విద్యార్థి తలసిల హేమ శ్రీ సాయి సీనియర్స్ విభాగంలో జిల్లా స్థాయిలో తృతీయ స్థానంలో నిలిచారు. సేవా సంకల్ప అభియాన్ లో భాగంగా జిల్లా స్థాయిలో సోమవారం బాపట్లలో నిర్వహించిన చిత్రలేఖనం పోటీల్లో వీరు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయిలో జరిగే పోటీలకు ఎంపిక కావడం సంతోషంగా ఉందంటూ ప్రధానోపాధ్యాయులు యార్లగడ్డ రాజేశ్వరి, డ్రాయింగ్ టీచర్ పి. బాబురావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు