అమలాపురంలో వైయస్సార్‌సీపీ రూరల్ మండల విస్తృత స్థాయి సమావేశం.. పార్టీ బలోపేతమే లక్ష్యంగా పిలుపు
సూర్య అమలాపురం డెస్క్: అమలాపురం నియోజకవర్గం అమలాపురం రూరల్ మండల వైయస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం అత్యంత విజయవంతంగా నిర్వహించారు. అమలాపురం అసెంబ్లీ కోఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ ఆధ్వర్యంలో, ఎస్‌ఈసీ మెంబర్ మరియు వైస్ ఎంపీపీ కుడిపూడి భాగ్యలక్ష్మి బాబు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ వేదికగా గ్రామ కమిటీ అధ్యక్షులకు వారియా గ్రామాలక సంబంధించిన అధికారిక పార్టీ గుర్తింపు కార్డులను నేతలు అందజేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ పినిపే శ్రీకాంత్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో పార్టీని మరింత పటిష్టం చేసే దిశగా ప్రతి నాయకుడు, కార్యకర్త సమష్టిగా శ్రమించాలని పిలుపునిచ్చారు. గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతానికి అవసరమైన కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలని దిశానిర్దేశం చేశారు. కష్టకాలంలోనూ పార్టీ కోసం నిలబడ్డ కార్యకర్తలే మన బలామని, భవిష్యత్తులో ప్రజల సమస్యలపై పోరాటాలు ఉధృతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ కార్యదర్శులు బొంతు గోవింద్‌శెట్టి, ధంగేటి రుద్ర, రాష్ట్ర లీగల్ సెల్ సంయుక్త కార్యదర్శి చొల్లంగి సుబ్బురాం, జాన గణేష్, పొనకల గణేష్, పొలమూరి బాలకృష్ణ, కేత భానుతేజతో పాటు మండల, గ్రామ అనుబంధ విభాగాల సభ్యులు మరియు భారీ సంఖ్యలో గ్రామ కమిటీ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.