అల్లూరు ఏకగ్రీవ గ్రామ సర్పంచ్ మాండ్ర విజయమ్మ
నందికొట్కూరు రూరల్ మేజర్ న్యూస్-: గ్రామ ఐక్యతే బలం… సమష్టి కృషితోనే అభివృద్ధి సాధ్యమని అల్లూరు గ్రామ ఏకగ్రీవ గ్రామ సర్పంచ్ మాండ్ర విజయమ్మ తెలిపారు. శుక్రవారం మండల పరిధిలోని అల్లూరు గ్రామ అభివృద్ధే లక్ష్యంగా కూటమి నాయకులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులందరినీ సమన్వయం చేసుకుంటూ అందరి సమష్టి కృషితో అల్లూరు గ్రామంలో సర్పంచ్‌తో పాటు 12 మంది వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.అల్లూరు గ్రామానికి చెందిన దివంగత మాండ్ర రత్నాకర్ రెడ్డి సతీమణి మాండ్ర విజయమ్మ సర్పంచ్ అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎంపిక కాగా, 12 మంది వార్డు సభ్యులు సైతం ఏకగ్రీవంగా ఎంపికయ్యారు.
ఈ సందర్భంగా ఏకగ్రీవంగా ఎంపికైన సర్పంచ్ మాండ్ర విజయమ్మ కి, వార్డు సభ్యులందరికీ నందికొట్కూరు టీడీపీ సీనియర్ నాయకులు మాండ్ర శివానందరెడ్డి , నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త జయసూర్య ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో నందికొట్కూరు టీడీపీ సీనియర్ నాయకులు మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి , నందికొట్కూరు మండల జడ్పీటీసీ కురవ వెంకటేశ్వర్లు , మాండ్ర పురుషోత్తం రెడ్డి , కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.