అఖిల భారతీయ స్థాయిలో వందేమాతరం గేయాన్ని ఆలపిద్దాం-రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ ప్రొఫెసర్ జి.రామకృష్ణారెడ్డి
నంద్యాల అర్బన్: నంద్యాల
స్థానిక శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల నందు ఈరోజు అనగా శుక్రవారం *వందేమాతర గేయ సమ్మేళనం* అనే కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కళాశాల చైర్మన్ ప్రొఫెసర్ జి.రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. మరియు డైరెక్టర్ డా.జి.హేమంత్ రెడ్డి, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు ఎంతో మంది ఈ సమ్మేళనంలో పాల్గొన్నారు.
ముందుగా ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థుల ఉపన్యాసాలతో మొదలుపెట్టారు. విద్యార్థులు అందరూ కూడా ఎంతో చక్కగా వందేమాతరం గేయం గురించి విద్యార్థులందరికీ తెలియతెలియజేశారు.
ఎంతో చక్కగా విద్యార్థులు వందేమాతరం గేయాన్ని నృత్యంతో ప్రదర్శించారు. కళాశాల ప్రొఫెసర్ జి.రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ నమామి భారతం విద్యా భారతి ఆధ్వర్యంలో అఖిల భారతీయ స్థాయిలో వందేమాతరం గేయాన్ని ఆలపిద్దాం అని అందరికీ పిలుపునిచ్చారు. వందేమాతరం అనేది భారతదేశం యొక్క జాతీయ గేయం. ఇది మన మాతృభూమి అయిన భరతమాతను కీర్తిస్తూ, స్వాతంత్ర్యోద్యమంలో ప్రజలలో దేశభక్తిని రగిలించిన గొప్ప గీతందీనిని బంకిమ్ చంద్ర ఛటర్జీ 1870లలో బెంగాలీ మరియు సంస్కృతంలో రాశారు. ఇది 1882లో ఆయన రచించిన ప్రసిద్ధ నవల 'ఆనందమఠ్' లో ప్రచురితమైంది.1905లో బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్య సమయంలో ఈ నినాదం, గేయం దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య సమరయోధుల్లో నూతనోత్సాహాన్ని, దేశభక్తిని నింపింది.భారతదేశంలో ప్రతి ఒక్క చోట పూర్తి వందేమాతరం గేయ ఆలాపన జరపాలి అని కేంద్ర ప్రభుత్వం వారు అందరికీ తెలియజేశారు. దేశంలో ప్రతి ఒక్క చోట 11 గంటలకి వందేమాతర గేయ ఆలాపన మొదలై 11: 5 నిమిషాలు ముగించాలి అని తెలియజేశారు. దీనివలన వందేమాతర గేయం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు చేసుకుంటుందని తెలియజేశారు. ఈ నూతన వందేమాతరంలో మన వెనుక తరాల వారు ఎలా మనకు స్వాతంత్రం తెచ్చారు వారు ఎలా ప్రాణాలను త్యాగం చేశారు మన కోసమనేది వివరించారు. ఈ కార్యక్రమం మన కళాశాలలో నిర్వహించినందుకు ఎంతో సంతోషంగా ఉంది అని తెలియజేశారు. ఈ మహా సమ్మేళనంలో 800 విద్యార్థులు పాల్గొన్నారు.
శ్రావణి కుమారి మాట్లాడుతూ వందేమాతర గేయం మన జాతీయ గీతం ఈరోజు ఈ గేయాన్ని పూర్తిగా ఆలపించడం మన అదృష్టం అని తెలియజేశారు. దేశంలో వివిధ చోట్ల ఈరోజు వందేమాతర గేయ ఆలాపన సమ్మేళనాలను నిర్వహించాలి అని కేంద్ర ప్రభుత్వం వారు అందరికీ తెలియజేశారు. విద్యా భారతి అఖిల భారతీయ విద్యా సంస్థ వందేమాతరం సామూహిక గానం ఆలపించాలని పిలుపునిచ్చారు. ఈ మహా సమ్మేళనంలో ఎంతోమంది విద్యార్థులు మరియు అధ్యాపక బృందం ఎంతో చురుగ్గా పాల్గొని ఈ మహా సమ్మేళనాన్ని ఎంతో విజయవంతంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమం చివరగా జాతీయ గే ఆలాపనతో ముగించారు.