అభిమానులతో ఆత్మీయ కలయికలో పాల్గొన్న ఎం వి ఆర్
చోడవరం: అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలోని ఎం వి ఆర్ చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో అభిమానులతో ప్రత్యేక ముఖాముఖి మరియు ఆత్మీయ కలయిక కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చోడవరం నియోజకవర్గ నలుమూలల నుండి భారీ సంఖ్యలో అభిమానులు, ట్రస్ట్ ప్రతినిధులు మరియు స్థానికులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరినీ ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ, సరదాగా ముచ్చటించి, ఏ కష్టం వచ్చినా మీకు నేను ఎల్లప్పుడూ అండగా ఉంటాను అని భరోసా ఇచ్చారు. అభిమానులతో కలిసి కొంతసేపు సరదాగా గడపడంతో ట్రస్ట్ కార్యాలయంలో ఎంతో ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంది.
ఇదే వేదికపై ఎం వి ఆర్ ఆశీస్సులతో చోడవరం - మాడుగుల ఇన్ఛార్జిగా నూతనంగా ఎంపికైన గోపీనాథ్ రెడ్డి బాధ్యతలను స్వీకరించారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ, ట్రస్ట్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను మరింత వేగవంతంగా ముందుకు తీసుకెళ్తానని ఆయన తెలిపారు. ఈ ఆత్మీయ కలయిక కార్యక్రమంలో చారిటబుల్ ట్రస్ట్ సీఈఓ బలరాం, పీఆర్వో బోస్, ట్రస్ట్ మెంబర్ విష్ణువర్ధన్, గైపూరి రాజు, బంగారుమెట్ట నానాజీ లతోపాటు భారీ సంఖ్యలో ఎంవిఆర్ అభిమానులు, ట్రస్ట్ సభ్యులు మరియు స్థానికులు పాల్గొన్నారు.