ఆసుపత్రిలో గద్దె వెంకన్నకు ఎంపీ కేశినేని చిన్ని పరామర్శ
విజయవాడ మేజర్ న్యూస్ : తిరువూరు రూరల్ ఎంపీటీసీ అభ్యర్థి గద్దె వెంకన్న అస్వస్థతకు గురై విజయవాడలోని ఆయుష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) శనివారం ఆసుపత్రిని సందర్శించి ఆయనను పరామర్శించారు. ఆసుపత్రిలోని ఎం.ఐ.సి.యు. విభాగంలో చికిత్స పొందుతున్న గద్దె వెంకన్నను స్వయంగా కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రి ఎండీ గోపాలకృష్ణను కలిసి వెంకన్నకు అందిస్తున్న వైద్య సేవలు, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు. ఆయనకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని వైద్యులను కోరారు. గద్దె వెంకన్న త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజల మధ్యకు రావాలని ఎంపీ కేశినేని చిన్ని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వెంకన్నకు ధైర్యం చెప్పి, ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.