ఆనందపురం మండలంలో నాలుగు పంచాయతీలు ఏకగ్రీవం
ఆనందపురం, మేజర్ న్యూస్ : ఆనందపురం మండలంలో కూటమికి ఘన విజయం లభించింది. మండలంలోని బోని, శిర్లపాలెం, ముకుందాపురం, పందలపాక గ్రామ పంచాయతీల్లో కూటమి అభ్యర్థులు సర్పంచ్‌లుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ముఖ్యంగా బోని గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం కావడంలో ఆనందపురం మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు తాట్రాజు అప్పారావు గారు కీలక పాత్ర పోషించారు. గ్రామస్తులందరినీ ఒప్పించి, ఐక్యతతో ఏకగ్రీవం చేసిన ఘనత ఆయనకే దక్కిందని గ్రామస్తులు కొనియాడుతున్నారు.
ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్‌లు:
- బోని: సూరాల సత్య వరప్రసాద్
- శిర్లపాలెం: కొరాడ చిలకమ్మ - ఉప సర్పంచ్‌గా ఆమె కుమారుడు కొరాడ గౌరీ నాయుడు
- ముకుందాపురం: కోట్ల నాగులతాత
- పందలపాక: పోతిన గోవింద్
నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులందరికీ ఆనందపురం ఎంపీపీ తాట్రాజు అప్పారావు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.
నూతన సర్పంచ్‌లతో సమన్వయం చేసుకుంటూ గ్రామాల సమగ్రాభివృద్ధికి, గ్రామ ప్రజల సంక్షేమానికి, మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని, ప్రతి గ్రామం అభివృద్ధి పథంలో ముందుకు సాగేలా అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని ఎంపీపీ తాట్రాజు అప్పారావు తెలిపారు.