ఆలయమర్యాదలతో జర్నలిస్టులకు ఘనసత్కారం
పాలకొండ, సూర్య : దసరా ఉత్సవాల సందర్భంగా పాలకొండ శ్రీశ్రీశ్రీ కోట దుర్గమ్మ వారి ఆలయ విశిష్టత, చరిత్రలను, నవరాత్రి ఉత్సవాల విశేషాలను పాఠక లోకానికి అందించి, నవరాత్రి ఉత్సవాల విజయవంతానికి తమ వంతు పాత్ర పోషించిన జర్నలిస్టులకు సోమవారం అమ్మవారి ఆలయం తరపున అధికారులు, అర్చకులు ఘన సత్కారాన్ని అందించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకుడు గార్లపూడి లక్ష్మీప్రసాద్ శర్మ జర్నలిస్టులను ఆశీర్వదించారు. అనంతరం ఆయనతోపాటు ఆలయ కార్యనిర్వహణాధికారి సూర్యనారాయణ కలసి జర్నలిస్టులకు సాలుగులతో సన్మానించి, అమ్మవారి మెమెంటో, ప్రసాదం, దీపావళి రోజున నిర్వహించిన ధనలక్ష్మి కుంకుమ పూజలో పూజించిన కాయిన్ లను విలేకరులకు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవిష్యత్తులో అమ్మవారి ఆలయ అభివృద్ధి, 2027 దసరా ఉత్సవాలు, అమ్మవారి ఆలయంలో ప్రత్యేక రోజులలో నిర్వహించే కార్యక్రమాలు వంటివి ప్రజల దృష్టికి తీసుకు వెళ్లే విధంగా జర్నలిస్టులు మరింత కృషి చేసి, అమ్మవారికి ఖ్యాతిని మరింత రెట్టింపు చేసే దిశగా తమ వంతు సహకారం అందించాలని కోరారు. జర్నలిస్టులకు ఆలయం తరఫున ఘనంగా సత్కరించటం పట్ల జర్నలిస్టులు వర్షం ప్రకటించడమే కాకుండా, అమ్మవారి ఆలయ అభివృద్ధిలో తమదైన పాత్ర పోషించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యాలయ సహాయకుడు శ్రీనివాస్ శర్మ, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వి సత్యనారాయణ, గౌరవ అధ్యక్షుడు జొన్నలగడ్డ కామేశ్వరరావు లతోపాటు స్థానిక ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకుచెందిన జర్నలిస్టులు పాల్గొన్నారు.