BREAKING
వరుణ దేవుని యాగం లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే ముత్తుముల నెల్లూరు నగర కార్పొరేషన్ ఎన్నికల నగారా మోగడంతో వైఎస్సార్సీపీలో టికెట్ల కోసం పోటీ నెలకొంది. శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు కరెంటు బిల్లుల భారంపై హరీశ్‌రావు ఫైర్: "పండుగల ముందు ప్రజలకు పిడుగు లాంటి వార్త" కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణం సాధించిన శంకు కృపారావుకు వర్ల రామయ్య అభినందనలు పొదలకూరు శ్రీ పోలేరమ్మ జాతరకు ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు మాల్తుమ్మెద సొసైటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం బొగ్గు లైన్లో నివసించే ప్రతి ఒక్కరికి రెండు సెంట్ల ఇండ్ల స్థలం ఇచ్చి, ఇల్లు నిర్మించి ఇవ్వాలి- మంత్రి ఫరూక్ కి సిపిఎం వినతి "సేవా సేతు అభియాన్" ద్వారా ప్రజలకు చేరువవుతున్న "పీఎం-సూర్యఘర్: ముఫ్త్ బిజిలీ యోజన" - ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాల సిహెచ్‌సి రాపూర్‌కు జిల్లా స్థాయి స్వచ్ఛ ఆసుపత్రి అవార్డు బాపట్ల శ్రీ క్షీర భావనారాయణ స్వామి వారి ఆలయంలో ఘనంగా వరుణ జపములు మరియు వరుణ యాగం కడప కలెక్టర్ కార్యాలయంలో డీఆర్ కు వినతి పత్రం అందజేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నెల్లూరు నగర నియోజకవర్గంలో కార్పొరేటర్లుగా పోటీ చేయడానికి పెరుగుతున్న పోటీ విద్యా రంగంలో జిల్లాను ముందంజలో నిలపాలి- జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

ఆగిరిపల్లి ఉర్దూఘర్ కమ్ షాదీఖానా నిర్వహణపై మిస్టరీ!

Select Suryaa Now
ఆగిరిపల్లి  ఉర్దూఘర్ కమ్ షాదీఖానా  నిర్వహణపై మిస్టరీ!

ఆగిరిపల్లి, మేజర్ న్యూస్: ఏలూరు జిల్లా, మండల కేంద్రమైన ఆగిరిపల్లిలోని రాష్ట్ర ప్రభుత్వ  మైనారిటీ సంక్షేమ శాఖ  షాదీఖానా అండ్ ఉర్దూఘర్ నిర్వహణ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి షాదీఖానా, ఉర్దూఘర్‌కు అధికారికంగా నిర్వహణ కమిటీ లేదు,ప్రస్తుతం భవనం నిర్వహణ బాధ్యతలు మండల తహసిల్దార్ ఆదేశాల మేరకు వారి సిబ్బంది చూస్తున్నారని వెల్లడించారు.కార్యక్రమాలకు అద్దె ఎంత నిర్ణయించారు? వసూలు చేస్తున్న మొత్తాలు ఎవరి వద్ద జమ అవుతున్నాయి? అనే ప్రశ్నలకు సమాధానం లేదని  స్థానిక మైనారిటీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి.షాదీఖానాను వివాహాలు, ఇతర శుభకార్యక్రమాలకు వినియోగించుకునే వారి నుంచి అద్దెలు (రూ 2500లు+ కరెంట్ బిల్లు మెయింటినెన్స్  ఖర్చులు ) వసూలు చేస్తున్నట్లు స్థానికంగా ప్రచారం ఉన్నప్పటికీ, వసూలైన మొత్తాలకు అధికారిక రసీదులు ఇస్తున్నారా? ఆదాయాన్ని ఏ ఖాతాలో జమ చేస్తున్నారు? అనే విషయాలపై స్పష్టత లేదని, కొన్ని శుభకార్యాలు ఆ రెవెన్యూ సిబ్బందికి తెలియకుండా, ప్రైవేటు వ్యక్తుల ద్వారా  జరుగుతున్నట్లు, ఆ జమా ఖర్చులు కూడా వారి దృష్టికి రావాటం లేదని   పలువురు ఆరోపిస్తున్నారు. రసీదు పుస్తకాలు,ఆదాయ-వ్యయాల రిజిస్టర్లు, బ్యాంకు ఖాతాల వివరాలను బహిర్గతం చేయాలని వారు కోరుతున్నారు.గత ఐదేళ్ల లెక్కలపై కూడా ప్రశ్నలుగత ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 2024 వరకు షాదీఖానా, ఉర్దూఘర్ నిర్వహణకు సంబంధించిన జమా-ఖర్చుల వివరాలపైనా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆ కాలంలో అద్దెల రూపంలో ఎంత ఆదాయం వచ్చింది? నిర్వహణకు ఎంత ఖర్చు చేశారు? మిగిలిన మొత్తం ఎంత? ఎవరి ఆధ్వర్యంలో ఆర్థిక లావాదేవీలు జరిగాయి? సంబంధిత అధికారులు రికార్డులను పరిశీలించి, రికార్డు స్వాధీనం చేసుకున్నారా?  నివేదిక రూపొందించారా? అనే విషయాలు ప్రజలకు తెలియాల్సి ఉందని స్థానికులు అంటున్నారు.

అధికారులు స్పందించాలని 

ప్రభుత్వ ఆస్తిగా ఉన్న షాదీఖానా మరియు ఉర్దూఘర్ నిర్వహణలో పారదర్శకత ఉండాల్సిన అవసరం ఉందని మైనారిటీ వర్గాల ప్రజలు పేర్కొంటున్నారు. ప్రస్తుతం నిర్వహణ బాధ్యత ఎవరిది? అద్దె వసూళ్లకు అనుమతి ఎవరు ఇచ్చారు? రసీదులు ఎందుకు ఇవ్వడం లేదన్న ఆరోపణల్లో వాస్తవమెంత? అసలు ఈ షాదీ ఖానా అనేది మైనారిటీ శాఖదా? రెవిన్యూ శాఖదా? దీనిపై ఎవరు బాధ్యతలు తీసుకుంటుందని ప్రజలకు అనుమానం వస్తుంది. గత ఐదేళ్ల జమా-ఖర్చుల లెక్కలు ఏమిటి? అనే అంశాలపై సంబంధిత అధికారులు స్పష్టమైన ప్రకటన చేయాలని వారు కోరుతున్నారు.షాదీఖానామరియు ఉర్దూఘర్ నిర్వహణకు వెంటనే అధికారిక కమిటీ ఏర్పాటు చేసి, ఆదాయ-వ్యయాలపై సమగ్రంగా తనిఖీ నిర్వహించి, ప్రజల ముందు లెక్కలు వెల్లడించాలని మైనారిటీ వర్గాల ప్రజలు అధికారులను డిమాండ్ చేస్తున్నారు.

 రిపోర్టర్: బాబు, ఆగిరిపల్లి, ఏలూరు జిల్లా,