BREAKING
ప్రాచీన్ గ్లోబల్ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే జిఎంఆర్ రాష్ట్రానికి మరో తుపాను దృష్ట్యా ముందస్తు చర్యలు కూటమి అరాచక పాలనను తరిమేద్దాం --మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పిలుపు గుండె శస్త్రచికిత్స చేయించుకున్న అంజయ్యకు ఆర్థిక సహాయం అందజేసిన జిఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ బిఆర్ఎస్ నాయకులు గుర్రపు మచ్చేందర్ మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి ప్రాచీన్ గ్లోబల్ హాస్పిటల్ ప్రారంభించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ అంజిరెడ్డి గుప్తా ఫౌండేషన్ అధినేత మడుపల్లి మోహన్ గుప్తాకు పద్మశ్రీ లేదా పద్మ విభూషణ్ అవార్డు ఇవ్వాలి టిడిపి జడ్పిటిసి అభ్యర్థి శ్రీనివాసవర్మ విస్తృత ప్రచారం రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లుమారేపల్లి సొసైటీ చైర్మన్‌ రాజు బొల్లారంలో ఇందిర గాంధీ వర్ధంతి వేడుకలు గుట్టపాడులో టీడీపీ ఎన్నికల ప్రచారం బాలికకు అండగా.. బెంగళూరుకు లోకేష్ రాప్తాడు పాఠశాలలో విద్యార్థినిపై దాడి అమానుషం.. ఏపీ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయభాస్కర్ కక్షిదారులకి సత్వరమే న్యాయం అందలి -- తెలంగాణ రాష్ట్ర గౌరవ హై కోర్టు జర్జి గాడి ప్రవీణ్ కుమార్ బస్ డిపో కై స్థలాన్ని కేటాయించాలి

ఆదాల సుగుణమ్మను భారీ మెజార్టీతో గెలిపించండి

Select Suryaa Now
ఆదాల సుగుణమ్మను భారీ మెజార్టీతో గెలిపించండి

పొదలకూరు,  మేజర్ న్యూస్ :    పొదలకూరు బిట్‌-1 టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థిని ఆదాల సుగుణమ్మను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె కుమారుడు, టీడీపీ యువ నాయకుడు ఆదాల మురళి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పరిషత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పొదలకూరు పట్టణంలోని మస్తాన్‌రెడ్డి నగర్, శివాలయం వీధిలో బీజేపీ నాయకుడు బొడ్డు గురుస్వామితో కలిసి ఇంటింటా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలుచోట్ల మహిళలు హారతులు పట్టి ఘనస్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఆదాల మురళి మాట్లాడుతూ సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రజలు సైకిల్ గుర్తుకు ఓటేయాలని కోరారు. తన తల్లి ఆదాల సుగుణమ్మను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు. మస్తాన్‌రెడ్డి నగర్, శివాలయం వీధితో పాటు బిట్‌-1 పరిధిలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి ఎమ్మెల్యే సోమిరెడ్డి సహకారంతో కృషి చేస్తామని హామీ ఇచ్చారు.జెడ్పీటీసీ అభ్యర్థి కలిచేటి ప్రభాకర్ రెడ్డిని సైతం భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి ఆశీస్సులతో పోటీ చేస్తున్న మండలంలోని టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థులందరికీ సైకిల్ గుర్తుపై ఓటేసి మద్దతు ఇవ్వాలని కోరారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. స్థానిక సంస్థల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధిస్తే గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు మరింత ప్రాధాన్యత లభిస్తుందని పేర్కొన్నారు.మస్తాన్‌రెడ్డి నగర్, శివాలయం వీధిలో నిర్వహించిన ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ యువ నాయకుడు ఆదాల మురళి, బీజేపీ నాయకుడు బొడ్డు గురుస్వామితో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.