BREAKING
మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి ప్రాచీన్ గ్లోబల్ హాస్పిటల్ ప్రారంభించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ అంజిరెడ్డి గుప్తా ఫౌండేషన్ అధినేత మడుపల్లి మోహన్ గుప్తాకు పద్మశ్రీ లేదా పద్మ విభూషణ్ అవార్డు ఇవ్వాలి టిడిపి జడ్పిటిసి అభ్యర్థి శ్రీనివాసవర్మ విస్తృత ప్రచారం రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లుమారేపల్లి సొసైటీ చైర్మన్‌ రాజు బొల్లారంలో ఇందిర గాంధీ వర్ధంతి వేడుకలు గుట్టపాడులో టీడీపీ ఎన్నికల ప్రచారం బాలికకు అండగా.. బెంగళూరుకు లోకేష్ రాప్తాడు పాఠశాలలో విద్యార్థినిపై దాడి అమానుషం.. ఏపీ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయభాస్కర్ కక్షిదారులకి సత్వరమే న్యాయం అందలి -- తెలంగాణ రాష్ట్ర గౌరవ హై కోర్టు జర్జి గాడి ప్రవీణ్ కుమార్ బస్ డిపో కై స్థలాన్ని కేటాయించాలి బాలాజీ ఫార్మసీ కళాశాలలో కృత్రిమ మేధస్సుపై జాతీయ సదస్సు మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి ---నషా ముక్త్ భారత్ అభియాన్ కమిటీ సమావేశంలో అదనపు కలెక్టర్ నగేష్ ఎమ్మెల్యే జారె ఆదినారాయణను మర్యాదపూర్వకంగా కలిసిన కొప్పుల రాంబాబు* ఉపసంహరించుకున్న అభ్యర్థికి మ్యాండిట్ ఎలా ఇచ్చారు? --ఎంపీటీసీ అభ్యర్థుల ఆరోపణ

53 రోజుల నిర్బంధం.. ప్రజల మద్దతు మరువలేను

Select Suryaa Now
53 రోజుల నిర్బంధం.. ప్రజల మద్దతు మరువలేను

కష్టకాలంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు

నియంతృత్వాన్ని ధిక్కరించి తెలుగు జాతి చూపిన చొరవ నన్ను నిలబెట్టింది

2047 నాటికి తెలుగు జాతిని నంబర్‌ వన్‌గా నిలబెడతా

సూర్య స్టేట్ బ్యూరో అమరావతి : 

సరిగ్గా మూడేళ్ల క్రితం ఇదే రోజు 53 రోజుల అక్రమ నిర్బంధం అనంతరం రాజమండ్రి జైలు నుంచి బయటకు వచ్చానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. నాడు తనకు అండగా నిలిచిన కోట్లాది తెలుగు ప్రజల మద్దతును జీవితాంతం మరువలేనని ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు. విధ్వంస పాలనను ప్రశ్నించినందుకు నంద్యాలలో అర్ధరాత్రి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తనను అరెస్టు చేశారని, అది అక్రమ నిర్బంధం, కుట్రపూరిత అరెస్టు అని ప్రజలందరికీ తెలిసిందన్నారు. నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో ఆ 53 రోజులు అత్యంత కఠినమైనవని పేర్కొన్నారు. న్యాయస్థానం తీర్పుతో తిరిగి ప్రజల్లోకి వచ్చినట్లు తెలిపారు.తనను ఒంటరిని చేయాలన్న కుట్రలను యావత్‌ తెలుగుజాతి తిరుగుబాటు బద్దలుకొట్టిందని చంద్రబాబు పేర్కొన్నారు. ‘సీబీఎన్‌ గ్రాటిట్యూడ్‌’ కార్యక్రమంలో గచ్చిబౌలి స్టేడియానికి వేలాదిగా తరలివచ్చిన యువత, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు, ప్రొఫెషనల్స్‌ తనకు మద్దతుగా నినదించిన ఘటనను జీవితాంతం గుర్తుంచుకుంటానన్నారు. తాను చేపట్టిన సంస్కరణలు, కల్పించిన అవకాశాలతో ఉద్యోగాలు పొందిన వారు స్వచ్ఛందంగా రోడ్డెక్కి సంఘీభావం తెలిపిన తీరు ఎంతో గొప్పదన్నారు.రాష్ట్రంలో, దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా 60కి పైగా దేశాల్లో తెలుగువారు, ప్రజాస్వామ్యవాదులు తనకు సంఘీభావంగా నిలిచారని చంద్రబాబు తెలిపారు. పల్లెల్లోని సామాన్య మహిళల నుంచి ప్రపంచస్థాయి కార్పొరేట్‌ సంస్థల సీఈవోల వరకు, రైతుల నుంచి సాఫ్ట్‌వేర్‌ నిపుణుల వరకు, విద్యార్థుల నుంచి ప్రవాసాంధ్రుల వరకు సమాజంలోని ప్రతి వర్గం నుంచి వెల్లువెత్తిన మద్దతు అపూర్వమన్నారు. రాజకీయాలకు దూరంగా ఉండే తన సతీమణి, కుటుంబ సభ్యులు ‘నిజం గెలవాలి’ అంటూ ప్రజల్లోకి వచ్చినప్పుడు వారితో కలిసి అడుగేసి నిజాన్ని గెలిపించి, ధర్మాన్ని నిలబెట్టారని పేర్కొన్నారు.

తనకు మద్దతుగా నిలిచిన ప్రతి పౌరుడు, కార్యకర్త, అభిమాని, ప్రజాస్వామ్యవాది, ప్రపంచవ్యాప్తంగా సంఘీభావం తెలిపిన ప్రతి ఒక్కరికీ చంద్రబాబు మరోసారి కృతజ్ఞతలు తెలిపారు. తన కష్టాన్ని తమ కష్టంగా భావించి స్పందించిన ప్రతి ఒక్కరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నానన్నారు. ప్రజల ప్రేమ, అభిమానం, నమ్మకాన్ని జీవితాంతం నిలబెట్టుకుంటానని, తన కోసం నిలిచిన వారి కోసం చివరి వరకు నిలబడతానని స్పష్టం చేశారు. ప్రజల నమ్మకం, అభిమానం తన బలమని, వారి భవిష్యత్తే తన సంకల్పమని తెలిపారు. అందరి మద్దతు, సహకారం, భాగస్వామ్యంతో 2047 నాటికి తెలుగు జాతిని నంబర్‌ వన్‌గా నిలబెడతానని పునరుద్ఘాటించారు.