46వ డివిజన్ కోవూరు నగర్‌లో దోమల నివారణకు ఫాగింగ్
అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్ : 46వ డివిజన్ పరిధిలోని కోవూరు నగర్‌లో దోమల సమస్య తీవ్రంగా ఉందని స్థానిక ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు డివిజన్ కార్పొరేటర్ ఖాజా వలి షేక్ వెంటనే స్పందించారు. ఈ సమస్యను ఎంహెచ్ఓ రవీంద్రనాథ్ దృష్టికి తీసుకెళ్లడంతో అధికారులు తక్షణమే స్పందించి కోవూరు నగర్‌లో ఫాగింగ్ కార్యక్రమాన్ని చేపట్టారు.
ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సమస్య పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకున్న నగర కమిషనర్ , ఎంహెచ్ఓ రవీంద్రనాథ్ కార్పొరేటర్ ఖాజా వలి షేక్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్య పరిరక్షణే తమ ప్రథమ ప్రాధాన్యత అని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు.
రిపోర్టర్ : మొయినుద్దీన్ అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్