43వ డివిజన్‌లో కూటమి అభ్యర్థులకు మద్దతుగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రచారం
నెల్లూరు, మేజర్ న్యూస్ : నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలోని 43వ డివిజన్‌లో కూటమి అభ్యర్థులకు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు. బీజేపీ నాయకుడు వాకాటి నారాయణ రెడ్డితో కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ, నెల్లూరు నగర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి మేయర్ అభ్యర్థి పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్‌తో పాటు 43వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి మొగరాల శోభకు ప్రజలు మద్దతు తెలపాలని కోరారు. కూటమి అభ్యర్థులకు ఓటు వేసి, భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నగర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు వివరిస్తూ నాయకులు, కార్యకర్తలు ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.