29 వార్డులో తెలుగు దేశం పార్టీ అభ్యర్థి ఘన విజయం.
కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గం మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో తెలుగుదేశం పార్టీ విజయపరంపర కొనసాగుతోంది. మున్సిపాలిటీ పరిధిలోని 29వ వార్డు కౌన్సిలర్‌గా టీడీపీ అభ్యర్థి అన్వర్ ఘన విజయం సాధించారు. ఓట్ల లెక్కింపులో ఆయనకు 518 ఓట్లు లభించడంతో విజయం ఖరారైంది. ఎన్నికల ప్రచార సమయంలో వార్డులో విస్తృతంగా పర్యటించి ఓటర్లను కలుసుకున్న అన్వర్‌కు ప్రజలు తమ మద్దతు ప్రకటించారు. ఓటర్లు అందించిన ఆదరణతో కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. ఫలితాలు వెలువడిన వెంటనే టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. అన్వర్ విజయంతో వార్డులో పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. ఎన్నికల్లో తనకు మద్దతుగా నిలిచిన ఓటర్లకు, విజయానికి కృషి చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు అన్వర్ కృతజ్ఞతలు తెలిపారు. వార్డు అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటానని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. 29వ వార్డులో టీడీపీ అభ్యర్థి విజయం మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో పార్టీకి మరింత బలాన్ని చేకూర్చింది.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి.