25 మంది వృద్ధులకు అన్నదానం
ఇంకొల్లు, మేజర్‌న్యూస్ :
ఇంకొల్లులోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం ఆవరణలో ప్రతి సోమవారం 25 మంది వృద్ధులకు అన్నదానం నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు మచ్చా నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. మద్దినేని ప్రతాప్, శివపార్వతి దంపతులు సోమవారం అన్నదాన కార్యక్రమానికి దాతలుగా వ్యవహరించారన్నారు. దాతల సహకారంతో ప్రతి సోమవారం అన్నదాన కార్యక్రమం చేస్తున్నామని నాగేశ్వరరావు వివరించారు. ఈ సందర్భంగా దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.
సూర్య రిపోర్టర్ : షేక్ జానిబాష, ఇంకొల్లు.