BREAKING
నేడే " పల్లె " పోరు నేటి రాశి ఫలాలు –5 నవంబర్, 2026 నేటి పంచాంగం 5 నవంబర్, 2026 ఓటు మన హక్కు బిజెపి ఆధ్వర్యంలో విస్తృతంగా ఇంటింటి ప్రచారం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో ఎంపీ ఆర్.కృష్ణయ్య భేటీ బీజేపీలో చేరిన కాంగ్రెస్ నాయకుడు నారాయణరెడ్డి పారిశ్రామిక అవసరాలకు శుద్ధి చేసిన నీరు: టీజీపీసీబీ దిశానిర్దేశం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం... - బుడమేరులో తగ్గిన నీటి ప్రవాహం – డ్రోన్ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ లండన్ డబ్ల్యూటీఎంలో తెలంగాణ పర్యాటక స్టాల్ ప్రారంభం వ్యయ నివేదికల సమర్పణపై దృష్టిపెట్టండి.. ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ ఎన్నిక‌ల‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు ప్రభుత్వ కార్యాలయాల ఆధునీకరణకు మంత్రి పొంగులేటికి ఎమ్మెల్యే బండారి విజ్ఞప్తి ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో పటిష్ట భద్రత క్రైస్తవుల సమస్యల పరిష్కారానికి గవర్నర్‌కు వినతి ఉప్పల్ డిగ్రీ కళాశాలకు స్థలం కేటాయించాలి: ఎమ్మెల్యే బండారి

21వ శతాబ్దం ఆసియా శతాబ్దం

Select Suryaa Now
21వ శతాబ్దం ఆసియా శతాబ్దం
తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ వి. బాలకిష్టారెడి
 
గుంటూరు   న్యూస్:  చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో విజ్ఞాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లా, మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ విభాగం ఆధ్వర్యంలో ‘ *లీగల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ప్రొఫెషన్‌: ఛాలెంజెస్‌ అండ్‌ ఆపర్చునిటీస్‌’* అనే అంశంపై ప్రత్యేక ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. చట్ట విద్య, న్యాయవృత్తిలో వస్తున్న మార్పులు, ఆధునిక న్యాయ రంగంలో అందుబాటులో ఉన్న అవకాశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ వి. బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ 21వ శతాబ్దం ఆసియా శతాబ్దంగా నిలవనుందని, ప్రపంచ న్యాయ, ఆర్థిక, సాంకేతిక రంగాల్లో భారత్‌ కీలక పాత్ర పోషించనుందని పేర్కొన్నారు. అంతర్జాతీయ వాణిజ్య చట్టాలు, ఐక్యరాజ్యసమితి, ప్రపంచ వాణిజ్య సంస్థ, బ్రెట్టన్‌ వుడ్స్‌ సంస్థలపై న్యాయ విద్యార్థులు అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. సరళీకరణ, ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, డిజిటలైజేషన్‌ వంటి పరిణామాలు న్యాయ వ్యవస్థపై చూపుతున్న ప్రభావాన్ని వివరించారు. విద్యార్థులు పుస్తక పఠనానికి ప్రాధాన్యతనిస్తూ నిరంతరం జ్ఞానాన్ని పెంపొందించు కోవాలని సూచించారు. తెలంగాణ హైకోర్టు న్యాయవాది అడ్వకేట్‌ భూమి సునీల్‌ కుమార్‌* మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు న్యాయం అందించడంలో గ్రామ న్యాయాలయాల ప్రాధాన్యతను వివరించారు. భూ చట్టాలు న్యాయవృత్తిలో ఎప్పటికీ ప్రాధాన్యత కలిగిన రంగమని, ఈ విభాగంలో న్యాయవాదులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. సమాజంలోని సమస్యల పరిష్కారానికి న్యాయ విద్యార్థులు తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య* మాట్లాడుతూ.. న్యాయవృత్తి కేవలం ఉపాధి మార్గం మాత్రమే కాదని, సమాజంలో సానుకూల మార్పు తీసుకురాగల శక్తివంతమైన సాధనమని పేర్కొన్నారు. సమాజం, రైతులు, వ్యవసాయ రంగానికి సంబంధించిన సమస్యలపై విద్యార్థులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. న్యాయ పరిజ్ఞానాన్ని ప్రజా సంక్షేమానికి వినియోగిస్తూ సామాజిక బాధ్యత కలిగిన న్యాయవాదులుగా ఎదగాలని ఆకాంక్షించారు. దేశ నిర్మాణంలో న్యాయవాదుల పాత్ర ఎంతో కీలకమని తెలిపారు.ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ముఖాముఖి చర్చలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రైవేటు అంతరిక్ష సంస్థల నియంత్రణ, అంతర్జాతీయ న్యాయ నిబంధనల ప్రకారం వాటి బాధ్యతలు, అంతర్జాతీయ వాణిజ్య చట్టాలు, అంతరిక్ష చట్టాల పరిణామాలపై ప్రశ్నలు అడిగారు. విద్యార్థుల సందేహాలకు ప్రొఫెసర్‌ బాలకిష్టారెడ్డి సమాధానాలిస్తూ.. అభివృద్ధి చెందుతున్న ఈ రంగాల్లోని సవాళ్లు, అవకాశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ హైకోర్టు న్యాయవాదులు అడ్వకేట్‌ భూమి సునీల్‌ కుమార్, అడ్వకేట్‌ జి. మధుసూదన్‌ రెడ్డి, వర్సిటీలోని వివిధ విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.