BREAKING
మా హయాంలో చరిత్రలో నిలిచిపోయే నీటిపారుదల పనులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మనసును హత్తుకునేలా మనోజ్ వాజ్ పేయ్ 'దిల్వాలి దివాలి' మూవీ.. నెట్‌ఫ్లిక్స్‌లో ఆకట్టుకుంటున్న ఫ్యామిలీ డ్రామా! బియ్యం ధరల దోపిడీపై తెలంగాణ ప్రభుత్వ ఉక్కుపాదం: రాష్ట్రవ్యాప్తంగా దాడులు – 370 కేసులు నమోదు జిల్లాకేంద్రంలో నిర్మల్ జిల్లా ఆర్ఎంపీ ల అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక : పదోతరగతివిద్యార్థులకు ఉచితంగా అన్ని అంశాల చదువు పుస్తకాల పంపిణీ పెండింగ్ పనుల్లో జాప్యం చేయొద్దు సోలక్ పల్లి లో ఉచిత వైద్య శిబిరం కోదాడ నియోజకవర్గంలో 219 మందికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ. తుఫాన్ బాధితులకు అండగా ప్రభుత్వం. ఎల్లంపేట మున్సిపాలిటీలో అంపశయ్యపై సమాచార హక్కు చట్టం.. మూడుసార్లు దరఖాస్తు చేసినా సమాచారం ఏదీ..? రైల్వే గేటు పడితే ట్రాఫిక్ కష్టాలే.. కిలోమీటర్ల మేర నిలిచిపోతున్న వాహనాలు అక్బర్జపేట్‌లో హరితహారం మొక్కల విధ్వంసం.. 150కి పైగా మొక్కలు ధ్వంసమైనా పట్టించుకునేవారేరి..? ఎంపీ సురేష్ కుమార్ షట్కర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన కోహిర్ మండల కాంగ్రెస్ నాయకులు వైద్య చికిత్సకు రూ.2 లక్షల ఎల్‌ఓసీ చెక్కు అందజేత క్రెడిట్ సొసైటీ మేనేజర్ మృతి పై విచారణ జరపాలి

యువతకు స్వయం ఉపాధి కల్పనపై మంత్రి శ్రీధర్ బాబుకు పానుగంటి విజయ్ గౌడ్ వినతి పత్రం

Select Suryaa Now
యువతకు స్వయం ఉపాధి కల్పనపై మంత్రి శ్రీధర్ బాబుకు పానుగంటి విజయ్ గౌడ్ వినతి పత్రం

యువతకు స్వయం ఉపాధి కల్పనపై మంత్రి శ్రీధర్ బాబుకు పానుగంటి విజయ్ గౌడ్ వినతి పత్రం

మునుగోడు,మేజర్ న్యూస్:బీసీల విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ప్రభుత్వం మరిన్ని అవకాశాలు కల్పించాలని కోరుతూ బీసీ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పానుగంటి విజయ్ గౌడ్ మంత్రి శ్రీధర్ బాబునీ కోరారు. శుక్రవారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాసంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, పరిశ్రమలు మరియు వాణిజ్య, శాసన వ్యవహారాల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా బీసీ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు విస్తృతం చేయడంతో పాటు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందించాలని కోరారు. విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీలకు మరిన్ని అవకాశాలు కల్పించి సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ముఖ్యంగా చౌటుప్పల్ ప్రాంతంలోని వివిధ పరిశ్రమలు, కంపెనీల్లో స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. స్థానిక యువతకు ఉపాధి లభిస్తే వారి కుటుంబాల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటంతో పాటు ప్రాంతీయ అభివృద్ధికి కూడా దోహదపడుతుందని పేర్కొన్నారు. బీసీ యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఉపాధి అవకాశాల కల్పనకు తగిన చర్యలు తీసుకోవాలనీ కోరారు.

కె. ఇంద్రసేనారెడ్డి, మేజర్ న్యూస్, మునుగోడు, నల్గొండ