వ్యవసాయ విద్యుత్ సరఫరాపై TGSPDCL సీఎండీ ఆకస్మిక తనిఖీలు
రాయికల్, రామేశ్వరం గ్రామాల్లో క్షేత్రస్థాయి పరిశీలన…
ఫరూఖ్ నగర్, రంగారెడ్డి:
వ్యవసాయ విద్యుత్ సరఫరాపై TGSPDCL సీఎండీ జితేశ్ వి. పాటిల్ ఆదివారం క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. సందర్భంగా మండల పరిధిలోని రాయికల్, రామేశ్వరం గ్రామాల్లో ని పలు వ్యవసాయ ప్రాంతాల్లో డైరెక్టర్ శివాజీతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా వ్యవసాయ విద్యుత్ సరఫరా (AGL) వ్యవస్థలో విద్యుత్ కరెంట్, వోల్టేజీ స్థాయులను స్వయంగా పరిశీలించి, సరఫరా పరిస్థితులను సమీక్షించారు.
రైతులకు నిరంతరం నాణ్యమైన స్థిరమైన విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా క్షేత్రస్థాయి పనితీరును ప్రత్యక్షంగా పర్యవేక్షి స్తున్న మొగిలిపారు. సబ్‌స్టేషన్లు, ఫీడర్ల పనితీరు, సరఫరాలో అంతరాయాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ సరఫరా లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదని నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా అధికార యంత్రం పనిచేయాలని సూచించారు ఏ చిన్న సమస్య వచ్చిన అధికారులు వెంటనే స్పందించి పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ విద్యుత్ శాఖ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నరసింహారెడ్డి మేజర్ న్యూస్….