BREAKING
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుకు పకడ్బందీ చర్యలు ఎంపీ పై టీపీసీసీకి ఫిర్యాదు నేడు రూరల్ ఎంపీపీ గా కత్తి కళ్యాణి ప్రమాణ స్వీకారం వైస్ ఎంపీపీ ఎన్నిక.. ఎంపీపీని చేతులెత్తి ఎన్నుకోనున్న ఎంపీటీసీలు ఎంపీపై టీపీసీసీకి ఫిర్యాదు ఫిర్యాదు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ఎస్వీ నగర్ లో తాగునీటి సమస్యకు పరిష్కారం.. 16 డివిజన్ అభివృద్ధికి నిరంతరం కృషి... కార్పొరేటర్ ఆర్. నాగభూషణం అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ప్రజా సమస్యలపై hనిరంతరం పోరాడుతున్న సిపిఐ అభ్యర్థులను గెలిపించండి! సిపిఐ జిల్లా కార్యదర్శి పి. మురళి పిలుపు కాంగ్రెస్ ప్రభుత్వం తోనే నిరుపేద ప్రజల కలలు సాకారం దుప్పట్లు పంపిణీ ఎం ఆర్ పల్లి లో ఎన్నికల నామినేషన్ల సందడి.. ఎంఆర్ పల్లి వాసులకు ట్రాఫిక్ కష్టాలు! అవగాహన రాహిత్యంతో బారికేడ్ల ఏర్పాటు... పరకాల స్మశాన వాటిక ఆధునికరణకు పోచంపల్లి ఫౌండేషన్ ముందడుగు గ్రంథాలయాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో ఘనంగా సాహిత్య సదస్సు సాహితీవేత్తలను సత్కరించిన గ్రంథాలయ సంస్థ చైర్మన్ డా.గురవారెడ్డి చంద్రగిరి నియోజకవర్గంలో ప్రశాంతంగా తొలిరోజు నామినేషన్ల పర్వం – 20 కేంద్రాల్లో 107 పంచాయతీలు,1,198 వార్డులకు నామపత్రాల దాఖలు కొరుప్రోలు కొబ్బరి పీచు పరిశ్రమలో అగ్నిప్రమాదం!

వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో నూతనంగా నిర్మించిన చైర్మన్ ఛాంబర్ & సమావేశ మందిరాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్

Select Suryaa Now
వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో నూతనంగా నిర్మించిన చైర్మన్ ఛాంబర్ & సమావేశ మందిరాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్

కోహెడ ; కోహెడ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో రూ.13 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన చైర్మన్ ఛాంబర్ & సమావేశ మందిరాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్న మార్కెట్ కమిటీ చైర్మన్ బోయిని నిర్మలా జయరాజ్,వైస్ చైర్మన్ తిరుపతి రెడ్డి,వివిధ గ్రామాల సర్పంచ్ లు , ముఖ్య నేతలు,అధికారులు మంత్రి పొన్నం ప్రభాకర్ మండల మార్కెట్ యార్డులో దాదాపు రూ.2 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం. మార్కెట్ యార్డులో గోడౌన్ల నిర్మాణం, మెయిన్ రోడ్డు నుంచి మార్కెట్ యార్డులోకి వెళ్లే రోడ్డు, నూతన ఓపెన్ ప్లాట్‌ఫారమ్, స్టోరేజీ సదుపాయాల అభివృద్ధి పనులు పూర్తి చేస్తాం. మార్కెట్ కమిటీ ఆదాయం పెంచేందుకు జిన్నింగ్ మిల్లును కేటాయించేలా చర్యలు తీసుకుంటాం. జిన్నింగ్ మిల్లు కేటాయింపునకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మార్కెట్ యార్డ్ కార్యదర్శిని ఆదేశించాం. మార్కెట్ యార్డులో షెటర్ల సమస్యపై ప్రతిపాదనలు వస్తే సురేందర్ మోహన్ గారితో మాట్లాడి పరిష్కరిస్తాం. మార్కెట్ యార్డ్ ఎల్లప్పుడూ రైతులకు అండగా, అందుబాటులో ఉండాలి. గత రెండేళ్లుగా మార్కెట్ యార్డ్ అభివృద్ధికి, రైతుల సంక్షేమానికి కృషి చేసిన పాలకవర్గానికి అభినందనలు. ఈ నెల 25వ తేదీతో పాలకవర్గ పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను.
అందరి ప్రశంసలు పొందిన ఈ పాలకవర్గం రైతులకు మరింత మెరుగైన సేవలు అందిస్తూ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నాను.