విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు-జారే ఆదినారాయణ
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని అశ్వారావుపేట నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వక విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
ఈ విజయదశమి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి సౌభాగ్యాలు నింపాలని, ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలతో, ఆనందోత్సాహాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే విజయదశమి పండుగ ప్రతి ఒక్కరిలో నూతన ఉత్సాహాన్ని, ఆశలను నింపాలని, ప్రజలందరూ సుఖశాంతులతో, ఐకమత్యంతో జీవించాలని కోరుకుంటున్నాను.
ప్రజలందరూ విజయదశమి పండుగను ప్రశాంతమైన వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో, కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.మీకు, మీ కుటుంబ సభ్యులకు ఆ దుర్గామాత ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను అనితెలిపారు.
సూర్య రిపోర్టర్ మునీర్ అశ్వరావుపేట