BREAKING
భవాని మాత యూత్ అసోసియేషన్‌కు ఐదేళ్లుగా చేవెళ్ల మహి చేయూత.. కాసుల మహేందర్ గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపిన BMYA భారతీనగర్ డివిజన్‌లో ఘనంగా దసరా వేడుకలు ఉయ్యూరు మునిసిపల్ చైర్మన్ అభ్యర్థి ప్రవీణ్ కుమార్‌ను గెలిపించాలి రాజరాజేశ్వరి దేవిక దర్శనమిచ్చిన గ్రామ దేవత శ్రీ పైడమ్మ అమ్మవారు శిక్షణ కార్యక్రమాలు 85వ డివిజన్‌లో టీడీపీ అభ్యర్థి గెలుపునకు బొండా ఉమా ప్రచారం హింసాత్మక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు. ఖమ్మంలో జమ్మిబండపై ప్రత్యక్షమైన స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ సత్తుపల్లిలో ఆధునిక వైద్య సేవలకు మరో ముందడుగు.. ‘శస్త్ర హాస్పిటల్’ ప్రారంభం*మంత్రి తుమ్మల ఎమ్మెల్యేమట్టా రాగమయి దయానంద్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం మండల పరిధి పుల్లపాడు MPTC అభ్యర్థిగా మురాల ఫణికుమార్ వైసీపీకి షాక్ - టీడీపీలో చేరిన మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ స్వగ్రామంలో సీఎం రేవంత్‌రెడ్డి దసరా వేడుకలు: కోట మైసమ్మ అమ్మవారికి, జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు శ్యామల బేకరీ ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు సమక్షంలో వైసీపీలో చేరిక పాలకొండ ఏరియా ఆసుపత్రిలో నూతన హంగులు

విద్యాసంస్థల్లో వసతులు మెరుగుపర్చాలి రామాయంపేటలో కేజీబీవీ, మోడల్‌, జెడ్పీ పాఠశాలల్లో ఎమ్మెల్సీ కొమరయ్య పరిశీలన

Select Suryaa Now
విద్యాసంస్థల్లో వసతులు మెరుగుపర్చాలి రామాయంపేటలో కేజీబీవీ, మోడల్‌, జెడ్పీ పాఠశాలల్లో ఎమ్మెల్సీ కొమరయ్య పరిశీలన

సూర్య డెస్క్

ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు మెరుగైన మౌలిక వసతులు కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలంగాణ శాసనమండలి బీజేపీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌, ఎమ్మెల్సీ మల్క కొమరయ్య అన్నారు. రామాయంపేటలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాల, మోడల్‌ స్కూల్‌, జిల్లా పరిషత్‌ పాఠశాలలను ఆయన సందర్శించారు.ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి విద్యాబోధన, పాఠశాలల్లో ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాగునీరు, పారిశుధ్యం, పరిశుభ్రత, ఇతర మౌలిక వసతులను పరిశీలించారు. విద్యార్థులు ప్రశాంతమైన, పరిశుభ్రమైన వాతావరణంలో చదువుకునేలా అవసరమైన సదుపాయాలు కల్పించాలన్నారు.
పాఠశాలల్లో తన దృష్టికి వచ్చిన సమస్యలను ప్రభుత్వం, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, గురుకులాల్లో పనిచేస్తున్న టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ సిబ్బంది సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ కొమరయ్య పేర్కొన్నారు.