విద్యార్థులు భవిష్యత్ లో దేశాసేవకోసం పాటుపడాలి
సూర్య గంగాధర :విద్యార్థులు భవిష్యత్ లో దేశాసేవకోసం పాటుపడాలని .పోలీస్ ల అమరవీరుల సేవలు చిస్మరణీయం అని కరీంనగర్ సీపీ గౌస్ ఆలం, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో భాగంగా గంగాధర పోలిస్టేషన్ లో ఎస్ ఐ వంశీకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో అమరవీరుడు గుజ్జీటి మహేష్ స్మరించుకున్నారు. అమరేవీరుడి స్ఫూపానికి పుష్పగుచ్చం ఇచ్చి నివాళులుఅర్పించారు.దేశ భద్రతలో పోలీస్ పాత్ర కీలకమని అన్నారు. అమర వీరుడి కుటుంబాలను ప్రత్యేకంగా గౌరవించారు.ఈసందర్బంగా హాజరైన విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో కరీంనగర్ ఏసీపీ, చొప్పదండి సి ఐ, మండలాల ఎస్ ఐ లు పాల్గొన్నారు.