BREAKING
మా ఆస్తుల జోలికి వస్తే చట్టపరమైన చర్యలు తప్పవు 1 వార్డులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ మున్సిపల్ చైర్ పర్సన్ బెజవాడ లావణ్య నాగరాజు చినబోగిల సర్పంచ్‌గా మర్రాపు శంకరరావు ఏకగ్రీవ ఎన్నిక రామాయంపేటలో 142 మందికి చేయూత పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ అక్రమ మద్యం రవాణా భగ్నం.. 46 విస్కీ సీసాలు స్వాధీనం కన్నతల్లిని కడతేర్చిన కొడుకు రోకలిబండతో తలపై బాది దారుణ హత్య. గిన్నిస్ రికార్డు కెక్కిన రెండు నెలల చిన్నారి. చేయూతతో ఆర్థిక భరోసా - ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి పురుషులను మించి మహిళా ఓటర్లు! ఎస్.రాయవరంలో నేడు విద్యుత్ అంతరాయం! రేవుపోలవరం అయ్యప్ప పీఠానికి అయ్యప్ప విగ్రహం బహుకరణ! అమెరికా ప్రభుత్వ సేవల్లో టెక్నికల్ లోపాలకు సైబర్ దాడి కారణం కాదు: హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారి వెల్లడి! ఇంట్లో ఈ 10 రకాల మొక్కలు ఉంటే స్వచ్ఛమైన గాలితో పాటు సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం వెల్డింగ్ పని చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి. రష్యాలో కఠిన చట్ట సవరణ: యుద్ధ వ్యతిరేక వ్యాఖ్యలపై భారీ జరిమానాల బిల్లుకు స్టేట్ డూమా తొలి ఆమోదం!

విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దు వర్క్ అడ్జస్ట్మెంట్ ఉత్తర్వులను నిలిపివేయాలి

Select Suryaa Now
విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దు  వర్క్ అడ్జస్ట్మెంట్ ఉత్తర్వులను నిలిపివేయాలి

కొల్చారం ...,ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య, నాణ్యమైన బోధన అందుతుందనే నమ్మకంతో తమ పిల్లలను చేర్పిస్తే, వర్క్ అడ్జస్ట్మెంట్, డిప్యూటేషన్ పేరుతో ఉపాధ్యాయులను ఇతర పాఠశాలలకు, మండలాలకు పంపిస్తూ విద్యార్థుల భవిష్యత్తుతో అధికారులు చెలగాటమాడుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా అదనపు కలెక్టర్ నగేష్‌కు ఫిర్యాదు అందజేశారు. కొల్చారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుల వర్క్ అడ్జస్ట్మెంట్ ఉత్తర్వులను వెంటనే నిలిపివేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.తల్లిదండ్రుల ఫిర్యాదుపై స్పందించిన అదనపు కలెక్టర్ నగేష్, జిల్లా విద్యాధికారి రాజును ఈ వ్యవహారాన్ని పునఃపరిశీలించాలని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఎండీ ఖదీర్, బాల్‌రాజ్, శ్రీశైలం, సత్యనారాయణ, యాదగిరి, నాగరాజు, ఆంజనేయులు, కృష్ణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.