BREAKING
-నియామకమైన సందర్భంగా శ్రీ సిద్ధి గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు నూతన సుగుణ చికెన్ సెంటర్ ప్రారంభించిన మున్సిపల్ వైస్ చేర్మెన్ ప్రాచీన్ గ్లోబల్ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే జిఎంఆర్ రాష్ట్రానికి మరో తుపాను దృష్ట్యా ముందస్తు చర్యలు కూటమి అరాచక పాలనను తరిమేద్దాం --మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పిలుపు గుండె శస్త్రచికిత్స చేయించుకున్న అంజయ్యకు ఆర్థిక సహాయం అందజేసిన జిఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ బిఆర్ఎస్ నాయకులు గుర్రపు మచ్చేందర్ మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి ప్రాచీన్ గ్లోబల్ హాస్పిటల్ ప్రారంభించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ అంజిరెడ్డి గుప్తా ఫౌండేషన్ అధినేత మడుపల్లి మోహన్ గుప్తాకు పద్మశ్రీ లేదా పద్మ విభూషణ్ అవార్డు ఇవ్వాలి టిడిపి జడ్పిటిసి అభ్యర్థి శ్రీనివాసవర్మ విస్తృత ప్రచారం రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లుమారేపల్లి సొసైటీ చైర్మన్‌ రాజు బొల్లారంలో ఇందిర గాంధీ వర్ధంతి వేడుకలు గుట్టపాడులో టీడీపీ ఎన్నికల ప్రచారం బాలికకు అండగా.. బెంగళూరుకు లోకేష్ రాప్తాడు పాఠశాలలో విద్యార్థినిపై దాడి అమానుషం.. ఏపీ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయభాస్కర్

విధుల నిర్వహణలో నిర్లక్ష్యం ... కోరుట్ల ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ సస్పెండ్

Select Suryaa Now
విధుల నిర్వహణలో నిర్లక్ష్యం ... కోరుట్ల ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్  సస్పెండ్

సూర్య కోరుట్ల :కోరుట్ల విధుల నిర్వహణలో నిర్లక్ష్యం, పరిపాలనా పర్యవేక్షణలో వైఫల్యం, ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన కారణాలతో కోరుట్ల ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వి. సునీతారాణిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం జిల్లా కలెక్టర్ కోరుట్ల ఏరియా ఆసుపత్రిని సందర్శించి సూపరింటెండెంట్ సంబంధిత సమర్థ అధికారి నుంచి ముందస్తు అనుమతి పొందకుండా విధులకు గైర్హాజరైనట్లు గుర్తించారు. ఆసుపత్రి పరిపాలన, సిబ్బంది పర్యవేక్షణ, రోగులకు నిరంతర వైద్యసేవలు అందేలా చూడాల్సిన బాధ్యత కలిగిన అధికారి స్వయంగా అనుమతి లేకుండా గైర్హాజరు కావడాన్ని జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల్లో తీవ్రంగా పరిగణించారు. అంతే కాకుండా, ఆసుపత్రిలో పనిచేస్తున్న సిబ్బంది లో దాదాపు సగం మందికి ఒకేసారి సెలవులు మంజూరు చేసినట్లు గుర్తించారు. ఆసుపత్రి సేవలు నిరాటంకంగా కొనసాగేందుకు అవసరమైన సిబ్బంది అందుబాటు లో ఉండేలా చూడకుండా సెలవులు మంజూరు చేయడం పరిపాలనా నిర్లక్ష్యాన్ని, పర్యవేక్షణ లోపాన్ని సూచిస్తుందని కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రజలకు అత్యవసరమైన వైద్యసేవలు అందించే ప్రభుత్వ ఆసుపత్రిలో తగినంత మంది వైద్యులు, ఇతర సిబ్బంది అందుబాటులో ఉండటం అత్యంత అవసరమని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో గుర్తించిన లోపాల తీవ్రతను పరిగణనలోకి తీసుకుని, చేపట్టనున్న క్రమశిక్షణ చర్యల దృష్ట్యా డాక్టర్ వి. సునీతారాణిని సస్పెండ్ చేశారు. క్రమశిక్షణ చర్యలు ముగిసి తదుపరి ఉత్తర్వులు వెలువడే సస్పెన్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. సస్పెన్షన్ కాలంలో జిల్లా కలెక్టర్ ముందస్తు అనుమతి లేకుండా ప్రధాన కార్యస్థానాన్ని విడిచి వెళ్లరాదని ఉత్తర్వుల్లో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పేర్కొన్నారు.