వాలీబాల్ పోటీల్లో సత్తా చాటిన నర్సింగాపూర్ విద్యార్థులు - రాష్ట్రస్థాయికి ఇద్దరు ఎంపిక
సూర్యబోయినపల్లి ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి పాఠశాలల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో పద్నాలుగేళ్ల లోపు బాలబాలికల వాలీబాల్ పోటీలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కేశవపట్నంలో అక్టోబర్ ఇరవై ఐదవ తేదీన నిర్వహించారు. ఈ పోటీలలో సిరిసిల్ల జిల్లా బాలురు, బాలికల జట్లు ద్వితీయ స్థానం సాధించాయి.
ఈ పోటీలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నర్సింగాపూర్ విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబరిచారు. పాఠశాలకు చెందిన ఎన్.ఆదిత్య, ఆర్.అవంతిక రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు, బోయిన్‌పల్లి మండల విద్యాధికారి ఎన్.శ్రవణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థులను, వారి ఎంపికకు కృషి చేసిన వ్యాయామ ఉపాధ్యాయుడు టి.మధుకర్ రెడ్డిని గ్రామ సర్పంచ్, ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయ బృందం అభినందించారు.