ఉద్యాన అభివృద్ధి మిషన్ వారి ఆధ్వర్యంలో ,పండ్లతోటలలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి, అవగాహన సదస్సు.
వట్టిపల్లి;మండలంలోని దుద్యాల గ్రామంలో శనివారం నాడు ఎల్ నినో ప్రభావము ,పండ్ల తోటలలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఉద్యాన అభివృద్ధి మిషన్ సైంటిస్ట్ ,డాక్టర్ నాగ హర్షిత్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేసినారు. డాక్టర్ నాగ హర్షిత్ మాట్లాడుతూ !యల్ నినో ప్రభావంతో తగినంత వర్షం పడనందున ,భూమిలో నీటి తేమ తగ్గిన కారణంగా, పండ్ల చెట్లు (మామిడి, జామ, కొబ్బరి) మొదలగు చెట్లు ఎండిపోయే అవకాశం కలదు. మల్చింగ్ పద్ధతి ,డ్రిప్పు పద్ధతి, స్పింకులర్ పద్ధతి ,(సూక్ష్మ బిందు పద్ధతి) పాటించి, చెట్లను కాపాడుకోవాలి అన్నారు .నీటి తడులు ఇచ్చే విధానము ,పూత, పిందే రాలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మందుల పిచికారి విధానము తెలిపినారు. మల్చింగ్, డ్రిప్, స్పింకులరులు,ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తుంది అన్నారు. జీవన ఎరువులు వాడాలి. కెమికల్ మందులు వాడరాదు అని తెలిపినారు. పందిరి నిర్మాణానికి ఒక ఎకరానికి ఒక లక్ష సబ్సిడీ లభిస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నాగహర్షితతోపాటు గ్రామ సర్పంచ్ ,రైతులు పాల్గొన్నారు.