తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య
ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని, తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో మరింత ముందుకు సాగాలని స్వామివారిని ప్రార్థించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజల మధ్య అన్యోన్యత, సోదరభావం ఎల్లప్పుడూ కొనసాగాలని ఆకాంక్షించారు.
అలాగే, పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్ నినో ప్రభావం తొలగిపోయి, సమృద్ధిగా వర్షాలు కురిసి, రైతులు సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరికీ ప్రకృతి అనుకూలించి రాష్ట్రాలు పాడిపంటలతో కళకళలాడాలని శ్రీ వేంకటేశ్వర స్వామివారిని వేడుకున్నారు.