వైసీపీ తోనే నగర అభివృద్ధి సాధ్యం మాజీ మేయర్ మహమ్మద్ వసీం
అనంతపురం బ్యూరో (అనంతపురం బ్యూరో, మేజర్ న్యూస్) : వైసీపీ తోనే నగర అభిరుద్ది సాధ్యమవుతుందని మాజీ మేయర్ మహమ్మద్ వసీం పేర్కొన్నారు.నగర పాలక సంస్థ ఎన్నికల ప్రచారంలో భాగంగా 1,4 వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థులు షేక్షా వలి,,ప్రణతి లతోపాటు మేయర్ అభ్యర్థి చిట్లూరు రమేష్ లను గెలిపించాలని మాజీ మేయర్ మహమ్మద్ వసీం కోరారు.
నగర అభిరుద్ది చెందాలంటే ,నగరంలో ప్రశాంతత నెలకొనాలంటే వైసీపీ అభ్యర్థులను ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు.వైసీపీ ఐదేళ్ల పాలనలో నగరంలోని అన్ని డివిజన్ లలో మౌలిక సదుపాయాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చామని,మరోమారు అదే పాలన కావాలంటే వైసీపీ అభ్యర్థుల గెలుపు తోనే సాధ్యమవుతుందన్నారు.కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : మొయినుద్దీన్, అనంతపురం బ్యూరో, అనంతపురం.