శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న జిల్లా ఎస్పీ
సూర్య సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లాలో శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఆలయ అర్చకులు ఎస్పీ కి తీర్థప్రసాదాలు అందజేశారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట భద్రత ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు.సాయంత్రం నిర్వహించే రథోత్సవం సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా బందోబస్తు విధులలో ఉన్న అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలని సూచించారు.భక్తుల రద్దీని నిరంతరం పర్యవేక్షిస్తూ, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.